ఇదేనమ్మా RRR ట్విస్టు.. ఆ టైపు అంచనాలు పెంచుకొని నిరాశ చెందకండి.. క్లారిటీ ఇచ్చేశారు

అంచనాలు అనేవి ఏ స్థాయిలో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక సినిమా ఎంత బావున్నా కూడా కొన్నిసార్లు అంచనాల డోస్ వల్ల రిజల్ట్ మారిపోతుంది. ఈ కారణంగా శంకర్ సినిమాలు ఇప్పటికే మూడు సార్లు బోల్తా పడ్డాయి. ఇక నెక్స్ట్ RRR సినిమాపై అంతకుమించి అనేలా అంచనాలు ఆకాశం దాటి అంతరిక్షం స్థాయికి పెరిగాయి. ఇక RRR టీమ్ మొత్తానికి ఒక విషయంలో అయితే క్లారిటీ ఇచ్చేసింది.

ముందే ఒక క్లారిటీ ఉండాలని..

ముందే ఒక క్లారిటీ ఉండాలని..

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్ పై జనాల్లో ముందే ఒక క్లారిటీ ఉండాలని అనుకుంటాడు. మర్యాద రామన్న, ఈగ వంటి సినిమాల కథలను ముందే రివీల్ చేసి ఆ సినిమా ఎలా కొనసాగుతోందనే విషయంలో హైప్ క్రియేట్ చేశాడు. ఇక మిగతా సినిమాల విషయంలో సీక్రెట్ అయితే గట్టిగానే మెయింటైన్ చేశారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి..

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి..

బాహుబలి లాంటి సినిమా తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని భాషల్లో సినీ ప్రేక్షకులు స్పెషల్ ఫోకస్ పెడతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు అంటే అంచనాల డోస్ ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీగా పెరిగిపోయింది.

రాజమౌళి ఆ ఫొటో పోస్ట్ చేయడంతో

రాజమౌళి ఆ ఫొటో పోస్ట్ చేయడంతో

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ఒకానొక సందర్భంలో రెండేళ్లు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారని, అయితే అప్పుడు కలుసుకున్న వారు ఏం చేశారు అనే పాయింట్ తో ఒక కల్పిత కథగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి ముందే చెప్పాడు. ఇక రాజమౌళి రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ఒక లోగోను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ గా మార్చుకోవడంతో అనేక రకాల కథనాలు పూట్టుకొస్తున్నాయి.

హీరోలు చేతులు కలుపుతారు.. అందుకోసం కాదు

హీరోలు చేతులు కలుపుతారు.. అందుకోసం కాదు

ఇక నెటిజన్ అడిగిన ప్రశ్నకు RRR టీమ్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. స్వాతంత్ర్య పోరాటం కోసమే ఇద్దరు చేతులు కలుపుతున్నారనే సందేహంపై ఈ విధంగా సమాధానం ఇచ్చారు. వాళ్ళిద్దరూ చేతులు కలిపిన మాట వాస్తవమే.. కానీ స్వాతంత్ర్యం కోసం కాదు. అసలు ఈ సినిమా దేశభక్తికి సంబంధించినది కాదు.. అంటూ వివరణ ఇవ్వడంతో అసలు ట్విస్ట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
జక్కన్న పవర్ఫుల్ పాయింట్

జక్కన్న పవర్ఫుల్ పాయింట్

ఆలోచిస్తుంటే RRR కథలో జక్కన్న ఎదో పవర్ఫుల్ పాయింట్ ని సెట్ చేసుకున్నట్లు ఈజీగా అర్ధమవుతోంది. యాక్షన్ సీన్ లో ఎమోషన్ కూడా మంచి రోల్ ప్లే చేస్తుందని జక్కన్నకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి సినిమాలో ఏదో ఎమోషనల్ పాయింట్ ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా దేశ స్వాతంత్ర్యం నేపథ్యంలో తెరకెక్కడం లేదని అర్ధమయ్యింది. దీంతో అభిమానుల్లో అంచనాల డోస్ కూడా మరే అవకాశం ఉండవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X