SS Rajamouli శిష్యుడు డైరెక్టర్‌గా 1770 మూవీ.. పాన్ ఇండియా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నాయి. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను దేశం యావత్తు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 1770ని ప్రకటించారు. SS1 ఎంటర్‌టైన్‌మెంట్, PK ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై బాహుబభాషా చిత్రంగా ఈ సినిమాను బంకించంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ అనే నవలను ఆధారంగా చేసుకుని రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వ శాఖలో ఈగ, బాహుబలి వంటి భారీ చిత్రాలకు పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. 2021లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఆకాశవాణి' సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. వందేమాతరం పాట రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్ బి, సూరజ్ శర్మ విడుదల చేశారు.

దర్శకుడు అశ్విన్ గంగరాజు మాట్లాడుతూ ''ఇది నాకు పెద్ద ఛాలెంజింగ్ సబ్జెక్ట్. అయితే లెజెండ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మాత్రమే నేను తెరకెక్కించాలి. అద్బుతమైన పీరియాడిక్ సెట్స్, అద్భుతమైన ఎమోషన్స్, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ తదితర ఎలిమెంట్స్ అన్నీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో పక్కాగా సరిపోయాయి. ముందు కాస్త సందేహించాను. కానీ రామ్ కమల్‌గారితో మాట్లాడిన తర్వాత ఆయన విజన్ తెలసుకున్నాను. నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమాను తెరకెక్కించటానికి సిద్ధమయ్యాను. అలాగే నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మలను రీసెంట్‌గా ముంబైలో కలిశాను. సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలని అందరం సుదీర్ఘంగా చర్చించాం. వారు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు.. వారి టీమ్ వర్క్ చూసి వెంటనే వారితో కనెక్ట్ అయ్యాను.
150 ఏళ్ల క్రితం బంకించంద్రగారు రాసిన అనంద్ మఠ్ నవలలోని వందేమాతరం బ్రిటీష్ వారి పునాదులనే కదిలించాయి. ఈ సందర్భంలో ఇండియాలో టాప్ స్టోరి టెల్లర్ వి.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఆయన మాట్లాడుతూ ''వందేమాతరం అనేది ఓ మ్యాజికల్ పదం. మంత్రాన్ని బకించంద్ర ఛటర్జీ అనే మహర్షి మనకు అందించారు. ఇది జాతినంతటినీ ఏకం చేసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. 1770లో భారత స్వాతంత్య్ర సమరం కోసం మనలో స్ఫూర్తిని రగిల్చిన యోధులెందరో ఉన్నారు. వారి గురించి తెలియజేసే చిత్రమే 1770'' అన్నారు.
రామ్ కమల్ మాట్లాడుతూ నా విజన్‌పై నమ్మకంతో ముందుకు వచ్చిన నిర్మాతలు చాలా గొప్పవారు. దర్శకుడిగా అశ్విన్‌లో పాజిటివ్ వైబ్స్ నాకు నచ్చాయి. తన సొంత ఆలోచనలతో నన్ను వచ్చి తను కలిశాడు. తను విజువల్‌గా స్టోరినంతంటినీ వివరించాడు. ఆయన మూవీ ఆకాశవాణి చిత్రాన్ని నేను చూశాను. నాకెంతగానో నచ్చింది. స్టోరిని తను వివరించిన తీరు నాకెంతగానో నచ్చింది. 1770 చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌గారు అద్భుతమైన రచనను చేశారు. ఆయన ఆలోచనలు యూనిక్‌గా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాలో ఆయన కథ, కథనం సరిహద్దులను దాటి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇలాంటి ఓ మంచి టీమ్ కుదిరటం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.
జీ స్టూడియోస్‌పై హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మణికర్ణిక చిత్రాన్ని రూపొందించిన సుజోయ్ కుట్టి మాట్లాడుతూ ''విజయేంద్రప్రసాద్‌గారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయన చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఆయన ఈ సినిమాకు రైటర్ కాకుండా ఉండుంటే ఈ సినిమాను నేను చేసేవాడిని కాను'' అన్నారు.
కృష్ణ కుమార్ బి మాట్లాడుతూ ''సుజోయ్‌గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆనంద్‌మఠ్‌ను సినిమాగా తెరకెక్కించాలంటే అద్భుతమైన వ్యక్తుల కలయిక అవసరం. చిన్నప్పటి నుంచి వందేమాతరం పాటను పాడుతూనే పెరిగాం. ఇప్పుడు అదే మంత్రం ఎలా పుట్టిందనే దాన్ని ఆవిష్కరించడానికి మేం ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలవబోతున్నాం. నేను అశ్విన్ గంగరాజుతో సన్నిహితంగా పని చేశాను. రామ్‌గారు నాకు కథను నెరేట్ చేయగానే అశ్విన్ నా మదిలో మెదిలాడు'' అన్నారు.
1770 చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా ఎవరు నటిస్తారనే విషయాన్ని టీమ్ దసరా ముందుగానే నిర్ణయిస్తుంది. దీపావళి నాటికంతా మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు అశ్విన్ తన టీమ్‌తో కలిసి ఈ పీరియాడిక్ సినిమాను యూనిక్‌గా రూపొందించడానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











