twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR‌లో అన్ని పాటలా? రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో..

    |

    బాహుబలి సిరీస్ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక, దేశభక్తి ప్రధాన చిత్రం RRR. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిలోను, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.

    ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఈ చిత్రం స్వాతంత్ర్య సమరం నేపథ్యంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామారాజుగా రాంచరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

    RRR చిత్రంలో దేశభక్తి అంశాలు ఎక్కువగా ఉండటం కారణంగా సుమారు 8 పాటలు ఈ సినిమాలో ఉండేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. వాటిలో ప్రత్యేకంగా మూడు పాటలు దేశభక్తి ప్రధానమైనవనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశభక్తితో సాగే మూడు పాటలను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం.

     SS Rajamoulis RRR will have 8 songs

    గతంలో టాగూర్ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన నేను సైతం పాటకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. కాగా, ఎనిమిది పాటలతో కథను రాజమౌళి ఎలా డీల్ చేస్తారనే విషయం చాలా క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నది.

    ఇక ఇటీవల టాలీవుడ్‌లో 8 పాటలు ఉన్న సినిమాలు చూసి చాలా కాలమే అయింది. ఇద్దరు స్టార్ హీరోలు, ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఉండటంతో తప్పనిసరిగా డ్యూయెట్లు ఉంటే అవకాశం ఉంది. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రాంచరణ్‌ (రామరాజు)కు ప్రేయసిగా సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కనిపించనున్నది. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో రూపొందుతున్న RRR చిత్రం జూలై 20, 2020లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    English summary
    SS Rajamouli's RRR getting ready for Songs shoot. Reports suggest that, RRR will have 8 songs and Three Patriotic songs is penning by Suddala Ashok Teja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X