పూజతో కొత్త జీవితం.. ఎక్సైటింగ్‌గా ఉంది.. నిశ్చితార్థంపై కార్తీకేయ ట్వీట్!
ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ప్రముఖ నిర్మాత, దర్శకుడు దివంగత 'జగపతి' రాజేంద్రప్రసాద్ కుమారుడు రాంప్రసాద్ కుటుంబాల మధ్య బంధుత్వం జరుగబోతున్నది. రాజమౌళి కుమారుడు కార్తికేయ నిశ్చితార్తం జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో బుధవారం నిశ్చితార్తం జరిగింది. ఈ ఏడాది చివర్లోనే కార్తికేయ వివాహం జరుగనున్నది. తన వివాహంపై కార్తికేయ స్పందించారు.

అవును.. నా లైఫ్ పూజాతో కలిసి కొత్త జీవితంలోకి దూకడానికి సిద్దమవ్వడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మాపై అచంచలమైన ప్రేమ కురిపిస్తున్న మీకు థ్యాంక్స్. నా ప్రేమకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ కార్తికేయ ట్వీట్ చేశారు.
బాహుబలి చిత్ర నిర్మాణంలో దర్శకత్వ శాఖలో సేవలందించిన కార్తికేయ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడని సమాచారం.
ss rajamouli ss kartikeya jagapati babu jagapati rajendra prasad vb rajendra prasad ram prasad pooja prasad ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ కార్తీకేయ జగపతిబాబు జగపతి రాజేంద్ర ప్రసాద్


Click it and Unblock the Notifications