దిల్ రాజు నిర్మాతగా రాజమౌళి సినిమా.. తిరిగి పంపించిన జక్కన్న!
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు పేరు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద సినిమాలు తీసి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అయిన వాళ్లు చాలానే ఉన్నారు. కానీ కేవలం మీడియం బడ్జెట్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ చిత్రాలను నిర్మిస్తూ దిల్ రాజు స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ గా తన నుంచి సినిమా వస్తుందంటేనే మినిమమ్ అంచనాలు పెరిగేలా ఎదిగారు. మంచి మార్కెట్ ను కూడా సంపాదించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకూ ఆడియెన్స్ రెస్పాన్స్ అదిరిపోతుంటుంది. అంటే.. ఆ స్థాయిలో నిర్మాత దిల్ రాజ్ సినిమా పట్ల శ్రద్ధ వహిస్తుంటారు.
కొబ్బరికాయ కొట్టి.. గుమ్మడికాయ కొట్టే వరకూ అన్నీ క్రాఫ్ట్ ను పర్యవేక్షిస్తూ తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలను అందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని విడుదల చేశారు. దానికి పార్లల్ గానే విక్టరీ వెంకటేశ్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్ని తీసుకొచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.300 కోట్ల గ్రాస్ వరకు వసూళ్లు చేసింది. అలాగే గతంలో 'బలగం'తోనూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. తెలంగాణ కథలకు ప్రాధాన్యతనిస్తూ తీసిన సినిమా ఇది. ఇలా నిర్మాత దిల్ రాజు పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలు, టాలెంటెడ్ డైరెక్టర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ.. దిల్ రాజు నుంచి ఆడియెన్స్ కు ఒకే ఒక సందేహం మిగిలి ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఆయన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఒక్క సినిమా అయినా ఎందుకు రావడం లేదనేది చాలా మందికి ఉన్న డౌట్. అయితే ఈ విషయంపై దిల్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. జక్కన్నతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.
ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయాలని దిల్ రాజ్ ఓ సందర్భంలో కలిశారంట. కానీ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం పరోక్షంగా నో చెప్పినట్టు తెలిపారు. 'మీరు నిర్మాతగా చేస్తే ఒక్క సినిమానే ఇవ్వగలను కానీ.. అదే బడ్జెట్ లో మీరు ఎంతో మంది న్యూ టాలెంట్ కు జీవం పోయొచ్చు' అని బదులిచ్చారని తెలిపారు. జక్కన్న చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలనూ దిల్ రాజు ఇంకా బలంగా నమ్మారంట. అప్పటికే యంగ్ అండ్ న్యూ టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజ్ జక్కన్న మాటలకు ఫిదా అయ్యారు. ఇక తాను మరింతగా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తమ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలను ఫ్యామిలీతో కలిసి ఆడియెన్స్ థియేటర్లలో చూడగలగడమే తమ లక్ష్యమన్నారు. నెక్ట్స్ ప్రొడక్షన్ నుంచి 'తమ్ముడు' చిత్రం రానుంది.


Click it and Unblock the Notifications











