మహేష్ బాబు కోసం రెండు కథలు.. ఎట్టకేలకు అసలు విషయం రివీల్ చేసిన రాజమౌళి
ఇటీవల దర్శకుడు రాజమౌళి RRR సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయింది అనేది స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రాజమౌళి నుంచి తర్వాత రాబోయే సినిమా కూడా అంతకు మించి అనేలా ఉంటుంది అని అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి. రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి ఇప్పుడు రాజమౌళి కీలక విషయం బయట పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రెస్ట్ మోడ్ లో
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను అందుకునే అవకాశం ఉందనే చెప్పాలి. ఇక మొత్తానికి సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా కోసం పని చేసిన అందరూ ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారు.

సమయం దొరికి
దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయాలని గత పదేళ్ల నుంచి అనుకుంటున్నాడు. కానీ ఇద్దరికీ సరైన కథ సెట్ అవ్వడం లేదు అలాగే ఇద్దరికీ ఒకేసారి సరైన సమయం కూడా సెట్ అవ్వడం లేదు. ఇక ఇప్పుడు RRR సినిమా అనంతరం రాజమౌళికి సరైన సమయం దొరికినట్టు అయింది. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు.

విజయేంద్ర ప్రసాద్ లీక్
ఎలాగో సినిమా కోసం బ్రేక్ తీసుకున్న దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టనున్నారు. ఇప్పటివరకు అయితే పూర్తి కథ సిద్ధమవ్వలేదని అంటున్నారు. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో సినిమా ఉంటుంది అని ఇంతకుముందు రచయిత కే విజయేంద్ర ప్రసాద్ ఒక లీక్ ఇచ్చారు. కానీ రాజమౌళి మాత్రం ఇంకా తాను ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోలేదని చెప్పారు.

రెండు నెలల విశ్రాంతి
ఇప్పుడు కూడా అదే విషయం మీద ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. రీసెంట్‌గా ఓ హాలీవుడ్ మీడియాకు రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో చేయబోయే సినిమా జక్కన్న గురించి మాట్లాడారు. "సాధారణంగా ఓ సినిమా విడుదలైన తర్వాత రెండు నెలల విశ్రాంతి తీసుకుని, హాలిడే కి వెళ్లి వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీ కథ గురించి ఆలోచిస్తా అని ఆయన చెప్పుకొచ్చారు.
Recommended Video


స్టోరీ మీద మళ్ళీ కూర్చుంటా
కానీ కరోనా వల్ల 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు కొంత గ్యాప్ వచ్చింది. జనవరి 7న సినిమాను విడుదల చేయాలనుకుంటే... కరోనా కారణంగా మార్చి 25కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో మా నాన్న ఫోన్ చేసి 'టైమ్ వేస్ట్ చేయకు. కథ మీద కూర్చుందాం' అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొన్ని లైన్స్ డిస్కస్ చేసుకున్నామని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయేది యాక్షన్ అడ్వెంచర్ అని దానికి రెండు కథలు నా మైండ్ లో ఉన్నాయని అన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ సినిమా స్టోరీ మీద మళ్ళీ కూర్చుంటామని రాజమౌళి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











