సూర్య వల్లే పాన్ ఇండియా సినిమాలు తీశా.. ఆ అవకాశం అలా మిస్.. కంగువ ఈవెంట‌్‌లో రాజమౌళి

తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ కంగువ. దర్శకుడు శివ రూపొందించిన ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంగువ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. కంగువ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ..

కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నా గురించి తెలిపే వీడియోను ప్రదర్శించారు. అందులో మొదట పాన్ ఇండియా సినిమాలు నేను మొదలు పెట్టానని అన్నారు. వాస్తవానికి అది తప్పు. మొదటగా పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేసింది సూర్య. ఆయనను స్పూర్తిగా తీసుకోని నేను పాన్ ఇండియా సినిమాలు తీశాను. గజని సమయంలో ఆ మూవీని తెలుగు, ఇతర రాష్ట్రాల్లో ప్రమోట్ చేసిన విధానం చూసి.. నేను కూడా అలా పాన్ ఇండియా లెవెల్‌కు సినిమాను తీసుకెళ్లాలని అనుకొన్నాను అని రాజమౌళి అన్నారు.

SS Rajamouli says Suriya is inspirations for My Pan India Movies at Kanguva Pre Release Event

తమిళంలోనే కాకుండా తెలుగు, ఇతర భాషల్లో సూర్య ప్రమోషన్ చేసే తీరును చూసి.. నేను నా హీరోలకు చెబుతుండే వాడిని. సూర్య మాదిరగా ఇతర భాషల ప్రేక్షకుల వద్దకు సినిమాను తీసుకెళ్లే తీరును మనం కూడా పాటించాలని చెప్పేవాడిని. ఇతర భాషల ప్రేక్షకుల ప్రేమను కూడా మనం పొందాలని నేను సూచించే వాడిని అని జక్కన అన్నారు.

నేను సూర్య కలిసి ఓ సినిమా చేయాలని అనుకొన్నాం. కానీ కుదర్లేదు. అందుకు కారణం నేను. గతంలో ఓ మీడియా సమావేశంలో సూర్య మాట్లాడుతూ.. రాజమౌళి సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయానని అన్నాడు. ఆయన చెప్పింది తప్పు. నేను అవకాశాన్ని కోల్పోయానని అన్నారు. నటుడిగానే కాకుండా ఫిల్మ్ మేకర్‌గా కూడా రాణించడం చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

SS Rajamouli says Suriya is inspirations for My Pan India Movies at Kanguva Pre Release Event

కంగువ సినిమా విషయానికి వస్తే.. కొన్ని సినిమాలు అద్బుతమైన ప్రదేశాల్లో షూట్ చేస్తారు. మరికొన్ని చిత్రాలు భారీ సెట్ లొకేషన్లలో షూట్ చేస్తారు. కంగువ చూస్తే.. అద్బుతమైన లొకేషన్లలో సెట్ వేసి తీశారని అనిపిస్తుంది. మీరు బాగా కష్టపడి ఉంటారనే విషయం నాకు అర్దమైంది. మీ కష్టానికి ఫలితం తప్పకుండా లభిస్తుందనే నమ్మకం కలిగింది అని రాజమౌళి తెలిపారు.

కంగువ మేకింగ్ వీడియో చూస్తే మీ కష్టం తెలుస్తుంది. వంశీ, ప్రమోద్, రాజా నిర్మాతలందరూ ఇలాంటి సినిమా బాగా రావడానికి వారి టెక్నిషియన్స్‌ను ఎంత టార్చర్ చేస్తారో తెలుసు. నేను కూడా నా టెక్నిషియన్స్‌ను టార్చర్ చేస్తాను. ఈ సినిమా మంచి అవుట్‌పుట్‌తో వచ్చిందని భావిస్తున్నాను. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి అందిస్తుందని అనుకొంటున్నాను అని అన్నారు.

More from Filmibeat

Read more about: ss rajamouli suriya kanguva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X