నాగ్ అశ్విన్‌కు రాజమౌళి షాక్.. జక్కన్న ప్రీ ప్లానింగ్ మామూలుగా లేదుగా..

SS Rajamouli - Nag Ashwin: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) కేవలం పేరు మాత్రమే కాదు.. ఇదొక బ్రాండ్‌. ఆయన మేకింగ్‌, టేకింగ్‌తో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేశారు. తన ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌లో అపజయం అంటూ చూడలేదు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'వారణాసి' అనే సినిమాను గ్లోబల్ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహానటి సినిమాతో సౌత్ ప్రేక్షకులను మెప్పింపి, ఆ తరువాత 'కల్కి 2898 ఏడీ'తో ఇండియన్‌ సినిమాను ప్రపంచ వేదికల మీద మరోసారి మెరిసేలా చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇలాంటి డైరెక్టర్ కు రాజమౌళి షాక్ ఇవ్వడమేంటీ అని అనుకుంటున్నారా? ఇంతకీ జక్కన్న చేసిన ఆ పనేంటీ అని ఆలోచిస్తున్నారా? వివరాల్లోకెళ్తే..

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన సినిమాల్లో 'సింగ్ గీతం'(Sing Geetham)ఒకటి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రత్యేక మ్యూజికల్ ఫాంటసీ మూవీ ఇది. ఈ సినిమాపై ఇప్పటికే సినీ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సింగీతం మరోసారి మెగాఫోన్ పట్టడం, ఆయన విజన్‌తో రూపొందిన సరికొత్త కాన్సెప్ట్ సినిమా కావడం, అలాగే వైజయంతి మూవీస్ - స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు. లెజండరీ డైరెక్టర్ తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.

SS Rajamouli Surprises Nag Ashwin Devi Sri Prasad Buys First Ticket for Sing Geetham Before Launch

ఈ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అలాగే.. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రమోషన్స్ లో భాగంగా 'సింగ్ గీతం'మూవీ యూనిట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన ఓ పని హైలెట్ గా మారింది. బుకింగ్స్ ప్రారంభమైన రోజే ఈ మూవీ టీంకు జక్కన్న ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా పెద్ద సినిమాల టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనప్పుడు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతుంటారు. కానీ రాజమౌళి మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించారు. 'సింగ్ గీతం' టీమ్ బుకింగ్స్ గురించి తెలియగానే ఆన్‌లైన్‌లోకి వెళ్లి స్వయంగా తొలి టికెట్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఈ విషయం తెలియని నాగ్ అశ్విన్, దేవి శ్రీ ప్రసాద్‌లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ రాజమౌళికి వీడియో కాల్‌లో మాట్లాడారు. బుకింగ్స్ ప్రారంభమయ్యాయని చెప్పడానికి సిద్ధమవుతుండగానే, జక్కన్న తన మొబైల్ స్క్రీన్‌లో ఇప్పటికే బుక్ చేసిన టికెట్‌ను చూపించారు. "ఆల్రెడీ బుక్ చేశా" అంటూ తన టిక్కెట్ ను చూపించడంతో నాగ్ అశ్విన్, డీఎస్పీ ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఆ క్షణం అక్కడ ఉన్న వారందరికీ ఒక మధురమైన సర్‌ప్రైజ్‌గా మారింది. ఈ వీడియోను వైజయంతి మూవీస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. సినీ అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా రాజమౌళి పనిని ప్రశంసిస్తున్నారు.

ఈ సర్‌ప్రైజ్ వెనుక ఒక ప్రత్యేక భావోద్వేగం కూడా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సింగీతం శ్రీనివాసరావు భారతీయ సినిమా చరిత్రలో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్స్ లో ఒకరు. పుష్పక విమానం, ఆదిత్య 369 వంటి క్లాసిక్ సినిమాలతో ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి లెజెండరీ దర్శకుడు 94 ఏళ్ల వయసులో మరోసారి కొత్త ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. అందుకే ఆయనపై ఉన్న గౌరవంతోనే రాజమౌళి ఇలా ముందుకు వచ్చి తన జక్కన్న సపోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు 'సింగ్ గీతం' కాన్సెప్ట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతవరకూ చూడని పూర్తి స్థాయి మ్యూజికల్ ఫాంటసీగా ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. సినిమాలో సంభాషణలకంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతుందని, కథ మొత్తం సంగీత రూపంలోనే ముందుకు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేకతే సినిమాపై ప్రత్యేకమైన అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణ. సంగీతమే కథకు ప్రధాన బలం కావడంతో డీఎస్పీ అందించిన ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక నిర్మాత నాగ్ అశ్విన్ విషయానికి వస్తే, 'కల్కి 2898 AD' వంటి భారీ విజయానంతరం ఆయన నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో 'సింగ్ గీతం'పై ఇండస్ట్రీలో ప్రత్యేక దృష్టి ఉంది. కంటెంట్ ఆధారిత సినిమాలను ప్రోత్సహించే నిర్మాతగా పేరున్న నాగ్ అశ్విన్, సింగీతం వంటి దిగ్గజ దర్శకుడి కలను తెరపై ఆవిష్కరించేందుకు ఈ సినిమాను నిర్మించడం కూడా విశేషమే. ఇలా జూన్ 12న విడుదల కానున్న 'సింగ్ గీతం'పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ మ్యూజికల్ ఫాంటసీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X