RRR షూటింగ్ లేటెస్ట్ అప్డేట్.. అత్యంత కీలకమైన షెడ్యూల్ లో జక్కన్న టీమ్!

బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న RRR సినిమా కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా 8 నెలల సమయం ఉన్నప్పటికీ ప్రతి రోజు ఎదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కారణంగా అంచనాల డోస్ అంతకంతకు పెరిగిపోతున్నాయి.

దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ చేయడంలో ఏ స్థాయిలో ఆలోచిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెగ్యులర్ గా లొకేషన్స్ ఫొటోలను వీడియోలను కూడా బాగానే విడుదల చేస్తున్నారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లోనే అసలైన సీన్స్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్ లో దాదాపు సినిమా మెయిన్ క్యాస్ట్ మొత్తం కనిపించనుందట.

ss rajamouli team busy in RRR key schedule

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు హీరోయిన్ అలియా భట్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక తమిళ్ యాక్టర్ సముద్రఖని కూడా చాలా రోజుల తరువాత చిత్ర యూనిట్ తో కలవనున్నట్లు సమాచారం. సినిమాలో మెయిన్ ఎమోషనల్ సీన్స్ ను కూడా షూట్ చేయబున్నట్లు టాక్ వస్తోంది. సినిమాలో అజయ్ దేవ్ గన్, శ్రియా కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్థాయి, అనుభవం ఉన్న నటీనటులు. ఇక షూటింగ్ బ్రేక్ టైమ్ లలో వాళ్ళు ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X