రాజమౌళికి కరోనా పాజిటివ్.. నీ సైనికుడు బాహుబలిని పిలువు అంటూ ఆర్జీవి ట్వీట్
ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ గురయ్యారు. బాహుబలి దర్శకుడిని త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాక్షిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించారు.
కరోనా మిమ్మల్ని ఏమీ చేయదు. సార్ మీ సైనికుడు బాహుబలిని పిలువండి. కరోనా ముడ్డిపై ఒక్క తన్ను తన్నమనండి. ఇది నేను సరదాకు అంటున్నాను. మీరు, మీ కుటుంబం అంతా బాగున్నారని అనుకొంటున్నాను. త్వరలోనే కరోనాను ఎదురించి సూపర్‌గా మంచి ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశిస్తున్నాను అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకు ముందు దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తాజా కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నాకు, నా కుటుంబానికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనలు, సలహాలతో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాం. త్వరలోనే ఈ వైరస్ నుంచి తేలుకొని ప్లాస్మా డొనేట్ చేస్తాం అని రాజమౌళి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











