Just In
- 20 min ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 54 min ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 1 hr ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
- 2 hrs ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ క్రికెట్లో క్రిస్టియానో రొనాల్డో: లారా ప్రశంసల వర్షం
- News
దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రం
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Automobiles
కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
RRR అప్డేట్: ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరో తెలుసా? రాజమౌళి క్రేజీ ప్రకటన.
బాహుబలి సిరీస్ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో అలియాభట్ మినహాయిస్తే మరో హీరోయిన్ ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ క్రమంలో RRR టీమ్ తాజాగా ఓ రెండు విషయాలను వెల్లడిస్తూ ప్రకటన చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఇంతకు ఆ రెండు వార్తలు ఏమిటంటే..

డైసీ ఎడ్గర్ జోన్స్ షాక్‌తో
RRR చిత్రంలో తొలుత ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అంతా సవ్యంగా సాగుతుందునుకొన్న సమయంలో ఆమె వ్యక్తిగత కారణాలను చూపుతూ సినిమా నుంచి తప్పుకొన్నది. అప్పటి నుంచి రెండో హీరోయిన్‌పై రకరకాలు వార్తలు, పలు హీరోయిన్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే మంగళవారం టీమ్ ఓ ప్రకటన చేస్తూ.. ఊహాగానాలకు తెరదించండి.. తారక్ సరసన నటించే హీరోయిన్ పేరును బుధవారం (నవంబర్ 20వ తేదీ) ఎనౌన్స్ చేస్తాం అని చెప్పారు.

70 శాతం సినిమా పూర్తి
ఇక RRR సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది. ఇప్పటికే ఈ సినిమా షూట్ 70 శాతం పూర్తయింది. చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ముగించేందుకు ఉరకలు వేస్తున్నది. ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్‌కే ప్రేక్షకుల ముదుకు వస్తున్నాం అని టీమ్ సంకేతాలు ఇచ్చింది. దాంతో RRR సినిమా విశేషాలు మళ్లీ వైరల్‌గా మారాయి.

అనేక అడ్డంకులతో
కాగా RRR సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి ఏదో రకంగా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. రాంచరణ్ గాయం బారిన పడటం, అలాగే ఎన్టీఆర్ చేతికి కూడా గాయం కావడంతో షూటింగ్‌కు కొంత విరామం ప్రకటించారు. వారిద్దరూ కోలుకొన్న తర్వాత ఉత్తరాదితోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సినిమా షూటింగ్ వేగవంతం చేశారు.

రిలీజ్ డేట్ పక్కాగా
RRR మూవీలో ఎన్టీఆర్, రాంచరణ్‌తోపాటు అజయ్ దేవగన్, సముద్రఖని, హాలీవుడ్ తార డైసీ ఎడ్గర్ జోన్స్ తదితరులు నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్లో దానయ్య చెప్పడం తెలిసిందే. ఈ చిత్రం జూలై 30, 2020లో రిలీజ్ కానున్నది.