"దోచేవారెవరురా" టీజర్ ను లాంచ్ చేయబోతున్న దర్శక ధీరుడు

తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం పంచేందుకు అన్ని హంగులను అద్దుకుని ముస్తాబయిన చిత్రం 'దోచేవారెవరురా'! గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శివనాగేశ్వరరావు చాలా కాలం తరువాత మళ్లీ ఈ సినిమా కోసం మెగా ఫోన్ పట్టుకోగా అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, ఆర్జే ప్రణవి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

"దోచేవారెవరురా" సినిమా టీజర్ డేట్ అనౌన్సమెంట్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ఎంతో విన్నూత్నంగా, తక్కువ నిడివితో ఉన్నప్పటికీ చక్కిలిగింతలు పెట్టే మరో వీడియోలో అజయ్ ఘోష్ టీజర్ ఎవరు విడుదల చేస్తున్నదీ చెప్పుకు వస్తున్నట్లు బయటపెట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఈ టీజర్ విడుదల చేయనున్నారట. జులై 29 సాయంత్రం సరిగ్గా 5గంటల 1 నిమిషానికి ముహూర్తం ఖరారు చేశారట. ఇంకేముంది దర్శక ధీరుడి పేరు వినిపిస్తే ఇక అందరి చూపు ఇటువైపు తిరగకుండా ఉంటుందా! అదే జరిగింది. ప్రస్తుతం ఎవరినోట విన్నా ఈ సినిమా గురించే ముచ్చట.

SS. Rajamouli to Release Dochevarevarura Teaser

ఇక వివరాల్లోకి వెళితే "మనీ", "సిసింద్రీ" , "పట్టుకోండి చూద్దాం" వంటి చిత్రాలతో తనదైన శైలిలో హాస్యాన్ని పండించి విలక్షణ దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు శివనాగేశ్వరరావు. అయన దర్శకత్వం వహిస్తూ, ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు ప్రణవ చంద్ర, మాళవిక జంటగా కనిపించబోతున్నారు. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ "దోచేవారెవరురా" తెరకెక్కింది.

ఏప్రిల్ లో "దోచేవారెవరురా" టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేయగా, తరువాత జూన్ లో యస్. పి. బాలు గారి జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో "సూళ్ళే బాకు" పాన్‌ గ్లోబ్‌ సాంగ్‌ లిరికల్ వీడియో సాంగ్ ను నటుడు తనికెళ్ళ భరణి గారి చేతుల మీదగా ఘనంగా విడుదల చేశారు , ఈ పాటలో అజయ్ ఘోష్, ఆర్ జె ప్రణవి పసందైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఏమైనా కాస్త కొత్తగా, మరింత ఆసక్తికరంగా ఉన్న ఈ పాట ఇప్పటికే మంచి ఆదరణ చూరగొంది. మరి ఇదే స్థాయిలో సినిమా కుడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X