సూర్య సినిమా కోసం రంగంలోకి రాజమౌళి... జూన్ 27 ముహూర్తం

తమిళ స్టార్ సూర్య హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాప్పన్'. ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా నటిస్తుండగా, ఎన్ఎస్‌జీ కమెండో పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. సూర్య, కెవి ఆనంద్ కాంబినేషన్లో గతంలో అయాన్(వీడొక్కడే), మాత్రన్(బ్రదర్స్) లాంటి చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 30న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమా రెండు భాషల్లోనూ విడుదలవుతుంది. 'కాప్పన్' తెలుగు వెర్షన్ టైటిల్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 27న ఉదయం 10.30 గంటలకు రాజమౌళి ఈ టైటిల్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో ఆర్య నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

SS Rajamouli will be unveiling the Telugu title of Kaappaan

సూర్య నటిస్తున్న ఇతర సినిమాల విషయానికొస్తే... 'సూరారై పొట్రు' అనే కొత్త సినిమా ఇటీవలే మొదలైంది. మాధవన్‌తో 'సాలా ఖాదూస్', వెంకటేష్‌తో 'గురు' లాంటి బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తెలుగు నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 'సూరారై పొట్రు' నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సూర్యతో పాటు అపర్ణ బాలమురళి, జాకీ ష్రాఫ్, మోహన్ బాబు, కరుణాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X