పునీత్ రాజ్‌కుమార్, సాయిధరమ్ తేజ్ విషయంలో అలా బాధపడ్డా.. ఎస్ఎస్ థమన్ ఎమోషనల్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించిన చిత్రం బ్రో ది అవతార్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 28వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 87 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎస్ఎస్ థమన్ బీజీఎంకు మంచి రెస్సాన్ వస్తున్నది. ఈ క్రమంలో బ్రో యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా థమన్ మాట్లాడుతూ..
ముందుగా నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటాను. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్ గారే అని తమన్ అన్నారు.

చెన్నైలో ఉన్నప్పటి నుంచి అంటే నటుడు, దర్శకుడు సముద్రఖని నాకు 20 ఏళ్ళ ముందు నుంచే తెలుసు. ఆయన మట్టి మనిషి. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన ఎంత బాగుంటుందో అంత స్వచ్ఛంగా ఉంటారు. బ్రో ది అవతార్ సినిమా వల్ల ఆయనతో నా అనుబంధం మరింత బలపడింది అని తమన్ చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ అంటే నాకు చాలా ఇష్టం. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డాను. సాయిధరమ్ తేజ్ అంటే అంత ఇష్టం నాకు. నా మనసుకి చాలా దగ్గరైన మనిషి. అందుకే సాయి తేజ్ సినిమాకి మనసుతో పని చేస్తాను అని తమన్ ఎమోషనల్ అయ్యారు.
బ్రో ది అవతార్ సినిమా క్లయిమాక్స్‌లో నా సంగీతంతో సాయి తేజ్‌పై ప్రేమని చూపించాను. పవన్ కళ్యాణ్ గారిని టైంగా చూస్తూ నేపథ్య సంగీతాన్ని మరింత బాధ్యతతో చేశాను. ఇంతమంచి సినిమాని ఇచ్చిన సముద్రఖని గారికి థాంక్స్ అని తమన్ అన్నారు.


Click it and Unblock the Notifications











