టీషర్టుతో అడ్డంగా దొరికేసిన థమన్.. భీమ్లా నాయక్, అల్లు అర్జున్ లతో లింకు పెట్టి మరీ వాయిస్తున్నారుగా!

టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌లలో థమన్ కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌స్ కొడుతూ మంచి జోష్‌ మీదున్నాడు థమన్. గత ఏడాది అల వైకుంఠపురం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు భీమ్లానాయక్‌ మూవీతో యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్నాడు. ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట సినిమాకు ట్యూన్ ఇస్తున్న ఆయన అనూహ్యంగా షర్ట్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే

మహేష్ తో ఫోటో

మహేష్ తో ఫోటో

థమన్ ఇప్పుడు మంచి సినిమాల్లో భాగమయ్యారు. ఇప్పటికే ఆయన సంగీతం అందిస్తున్న భీమ్లానాయక్‌ నుంచి విడుదలైన రెండు పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 'సర్కారువారి పాట' సినిమాకి కూడా తమన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ట్విట్టర్‌ వేదికగా తమన్‌ స్పందించాడు. తాజాగా విదేశాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్ సెట్స్‌లో మహేష్‌తో దిగిన ఒక ఫొటోని థమన్ తన ట్విట్టర్‌లో పంచుకున్నాడు.

ఆ ఫోటోనే కొంప ముంచింది

ఆ ఫోటోనే కొంప ముంచింది

ఆ ఫోటోను పంచుకోవడమే కాక మహేష్‌ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమా సాంగ్స్‌ కంపోజీషన్‌ పూర్తయ్యింది అంటూ థమన్ చెప్పుకొచ్చాడు. ఒకపక్క ఆ ఫొటోలో మహేష్‌ లుక్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్‌ బాబు ఇంకా అందంగా అవుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తుండగా మరో పక్క అనూహ్యంగా థమన్ ట్రోల్స్ బారిన పడ్డాడు.

టీషర్టుతో ట్రోల్స్

టీషర్టుతో ట్రోల్స్

దానికి కారణం ఆయన వేసుకున్న టీ షర్ట్ ఏ. విషయం ఏమిటంటే తాజాగా మహేష్ బాబు తో దిగిన ఫోటో షేర్ చేసినప్పుడు థమన్ వేసుకున్న టీ షర్ట్ కొద్ది రోజుల క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ వేసుకున్న రెండు ఒకలాగే ఉండడమే. దీంతో కొంతమంది థమన్ ట్యూన్స్ కాపీ కొడతాడు అని విన్నాం ఇప్పుడు స్టైల్ కూడా కాపీ కొడుతున్నాడు, అల్లు అర్జున్ టీషర్ట్ లాంటిదే ఆయన వేసుకోవడంలో అంతర్యం ఏమిటి? అంటూ పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అప్పుడే వేశాడుగా

అప్పుడే వేశాడుగా

అయితే థమన్ అభిమానులు కూడా అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు థమన్ భీమానాయక్ టైటిల్ సాంగ్ పాడుతున్న సమయంలోనే వేసుకున్నాడు అని కావాలంటే అప్పటి వీడియోలో ఆయన తను వేసుకున్న టీ షర్ట్ ని చూడమని కూడా కామెంట్లు చేస్తున్నారు. థమన్ ట్యూన్స్ ఒక్కోసారి కలవడం కామన్ అవుతూ ఉండొచ్చు కానీ ఆయన టీ షర్ట్ కూడా కాపీ కొట్టాడు అనడంలో ఏమాత్రం అర్థం లేనిదని వాళ్ళు కవర్ చేస్తున్నారు.

Recommended Video

Ss Thaman Releases Richie Gadi Pelli Song | Kailash Kher సూపర్
నాలుగో సారి

నాలుగో సారి

ఇక థమన్ 'దూకుడు' సినిమా మొదలు మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మ్యాన్', 'ఆగడు' సినిమాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు నాలుగోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X