శ్రీలీల బుగ్గ నిమిరిన తమన్.. తిరుపతి గుడిలో అదేం పని? ట్రోలింగ్!
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత చాలా ముఖ్యమనే ప్రతీ భక్తుడు భావిస్తాడు. ఆలయానికి వెళ్లినప్పుడు భక్తి మీదే తప్ప.. ధ్యాస మరో విషయం మీద ఉండకూడదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో కొందరు సెలబ్రిటీలు హద్దు మీరి ప్రవర్తించడం అత్యంత వివాదంగా మారింది. తాజాగా తిరుపతి గుడిలో శ్రీలీల కనపడగానే ఆమె బుగ్గ గిల్లి ప్రేమగా మాట్లాడుతూ కనిపించారు. అయితే ఆ విషయంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఆంధ్రాలో కొత్త సర్కారు ఏర్పాటు తర్వాత సినీ సెలబ్రిటీలు ఎక్కువగా దర్శనం చేసుకొంటూ కనిపిస్తున్నారు. ఇటీవల సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ప్రముఖులు శ్రీవారిని కాలినడకన దర్శించుకొన్నారు. తాజాగా తమన్, శ్రీలీల ఆ జాబితాలో చేరారు.

అయితే శ్రీలీల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. ఆమె తన తల్లిదండ్రులు, సిబ్బందితో కలిసి బాలాజీని దర్శించుకొని మొక్కు చెల్లించుకొన్నారు. అయితే గుడి నుంచి బయటకు వస్తుండగా.. తమన్‌కు శ్రీలీల ఎదురుపడింది. దాంతో ప్రేమగా పలకరించాడు. తనకు ఉన్న చనువుతో ప్రేమగా బుగ్గను సుతిమెత్తగా గిల్లినట్టు కనిపించింది.
గత ప్రభుత్వ హయంలో తిరుపతి పవిత్రతకు భగం కలిగిందనే వాదనలు ఎక్కువగా వినిపించాయి. అలాగే రాజకీయాలు, హద్దు మీరి ప్రవర్తించడం చేయకూడదని తాజా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నది. అయితే తాజాగా శ్రీలీలను చూడగానే తమన్ పొరపాటును తాను ఎక్కడ ఉన్నాననే విషయం మరిచిపోయి ఆమె చెంపను సుతారంగా తాకుతూ ప్రేమను కురిపించారు. అయితే ఆ విషయం మీడియా కంట పడింది. దాంతో ట్రోలింగ్ మొదలైంది.

ఇదిలా ఉండగా, గతంలో ఆదిపురుష్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించారు. ఆ సందర్భంగా కృతిసనన్, దర్శకుడు శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ఆ సమయంలో మాడ వీధుల్లో కృతి సనన్‌ను డైరెక్టర్ ముద్దు పెట్టుకోవడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











