Thaman Vs Boyapati: బోయపాటికి తమన్ దిమ్మతిరిగే కౌంటర్... అదేంటి బాసు అంత మాట అనేశాడు!
మాస్ డైరెక్టర్ బోయపాటి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మధ్య ప్రస్తుతం వార్ నడుస్తుందా.. వారికి అభిప్రాయ భేదాలు వచ్చాయా... అంటే అవుననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా ఎస్ఎస్ తమన్ ఆదివారం ఓ ట్వీట్ చేయడమే. ఆ ట్వీట్ చూసిన నెటిజన్స్... బోయపాటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరి మధ్య విభేదాలు రావడానికి కారణం అఖండ సినిమా. అదేంటి అనుకుంటున్నారా... అయితే ఈ స్టోరీ చదివేయండి.
బోయపాటి శ్రీనివాస్... సినిమాలు తీస్తే.. అందులో లాజిక్ లు ఉండవు... వ్యాన్ లు ఎగిరిపోవాల్సిందే.. రక్తపాతాలు జరగాల్సిందే. అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ వస్తుందనుకోండి... అయితే ఇటీవల స్కంద సినిమాతో రామ్ పోతినేనితో కలిసి వచ్చాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అంతే కాదు.. ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతగా రావడం లేదు.. ఇక డిజాస్టర్ దిశకు స్కంద సినిమా చేరుకుంటుంది.

ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు బోయపాటి శ్రీను, తమన్ మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే తమన్, బోయపాటి కాంబో హిట్ కదా.. వీరి కాంబోలో వచ్చిన సినిమాల మ్యూజిక్ సూపర్ హిట్టు కదా అంటారా... అవును.. అలా మ్యూజిక్ వల్లే వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తున్నాయి. ఇక వీరి కాంబినేషన్ లో అల్లు అర్జున్ సరైనోడు, బాలకృష్ణ అఖండ, రామ్ పోతినేని స్కంధ సినిమాలు వచ్చాయి.

ఇక సరైనోడు, అఖండ, స్కంద సినిమాలు మ్యూజిక్ పరంగా హిట్ అని చెప్పవచ్చు. మరి ఎందుకు వీరి మధ్య విభేదాలు అంటే... స్కంధ ప్రమోషన్స్ లో భాగంగా బోయపాటి ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో స్కంద సినిమా మ్యూజిక్ బాలేదనే కామెంట్స్ వచ్చాయి.. దీనిపై ఏం అంటారని ప్రశ్నించారు. దానికి బోయపాటి.. మ్యూజిక్ సెట్ కాకపోతే.. నేను యాక్సెప్ట్ చేయను.. కానీ చాలా మంది ఈ విషయంపై మాట్లాడుతున్నారు. అయితే నేను ఇప్పటి వరకు తమన్ తో మాట్లాడలేదు... అంటూ చెప్పుకువచ్చారు.

ఇక అఖండ సినిమాకు తమన్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడని.. అని బోయపాటి శ్రీనుకు గుర్తు చేయగా.. ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. అఖండ సినిమా ఆర్ఆర్ లేకుండా చూడండి.. మీరు గర్వంగా ఫీల్ అవుతారు. దానికి అంత దమ్ముంది అంటూ కామెంట్ చేశారు. దీనితో తమన్ ఈ విషయంపై బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ లేకున్నా హిట్ అవుతుందని అనడం ఫీల్ అయినట్లు తెలుస్తోంది.
ఇక బోయపాటి మాటలకు తమన్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. తన సోషల్ మీడియా వేదికగా ఐ డోంట్ కేర్ అంటూ రాసుకువచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ తమన్ దిమ్మతిరిగే కౌంటర్ ను బోయపాటకి ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమన్ ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారో కానీ... ఇది మాత్రం బోయపాటికే అంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











