నాని కోసం థమన్.. న్యూ జర్నీ స్టార్ట్ అంటూ సంగీత మాంత్రికుడి ట్వీట్
నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'టక్ జగదీష్'. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్‌తో ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం సంగీతం అందించనున్నారు.
ఈ నేపథ్యంలోనే థమన్ బాణీలు కట్టడం షురూ చేశారని తెలిసింది. ఈ మేరకు ''అవర్ న్యూ జర్నీ స్టార్ట్ విత్ నాని'' అని పేర్కొంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు థమన్. టక్ జగదీశ్ చిత్రానికి అద్భుతమైన పాటలందించి మరోసారి తన సత్తా చాటాలని కసిగా ఉన్నారట ఈ మ్యూజిక్ మాంత్రికుడు.
ఇటీవలే 'అల.. వైకుంఠపురంలో' సినిమాకు మ్యూజిక్ అందించి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు థమన్. ఈ సినిమాలోని పాటలు సరికొత్త రికార్డులు నెలకొల్పి తెలుగు సంగీతం గొప్పతనాన్ని చాటిచెప్పాయి. దీంతో మరింత బిజీ అయిపోయారు థమన్. ఆయన సంగీతమే కావాలని ఎక్కువమంది దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారట.

గతంలో ఇదే శివ నిర్వాణ- నాని కాంబినేషన్‌లో వచ్చిన 'నిన్నుకోరి' సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. అదేబాటలో మళ్ళీ రెండో సినిమాతో పలకరించేందుకు రెడీ అయిన ఈ జోడీ ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి!.


Click it and Unblock the Notifications











