SSMB 29: ఆ సమయం ఆసన్నమైంది.. ఫ్యాన్స్ కు మహేశ్ బాబు సర్ప్రైజ్
SSMB 29: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'SSMB 29'. ఈ వరల్డ్ వైల్ మూవీ చుట్టూ హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై ఎటువంటి అధికారిక క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక అప్డేడ్ ఇస్తూ హీరో మహేశ్ బాబు ఓ ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు. ఇంతకీ ఆ వీడియోలో మహేశ్ బాబు ఏం మాట్లాడారంటే?
'SSMB 29' ఈవెంట్‌కు "గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter Event)" అనే పేరు పెట్టారు. ఈ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించేందుకు రాజమౌళి టీమ్ సిద్ధమవుతోంది. జియో హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. దీనికోసం రాజమౌళి ప్రత్యేకమైన 3D సెట్‌లు, భారీ విజువల్ ఎఫెక్ట్ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సమాచారం ప్రకారం, రామోజీ ఫిల్మ్ సిటీలో 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉన్న LED స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్క్రీన్‌పై దాదాపు 3 నిమిషాల నిడివి గల ప్రత్యేక వీడియోను ప్రదర్శించనున్నారు. అందులో టైటిల్ రివీల్‌తో పాటు మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఈవెంట్‌కు ముందుగా మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా స్పెషల్ వీడియో షేర్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ "మీరు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. నవంబర్ 15న మేము క్రియేట్ చేసిన ప్రపంచాన్ని మీకు చూపించబోతున్నాం. ఇది మా కథలో మొదటి అడుగు. ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మీరు అసాధారణమైన అనుభవం పొందబోతున్నారు" అని తెలిపారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. "ఇంతకాలం వేచిచూసిన సమయానికి ఫైనల్ క్లారిటీ వస్తుందన్న మాట!" అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ #SSMB29 ట్రెండ్ అవుతోంది.
ఈ భారీ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ స్థాపించిన షోయింగ్ బిజినెస్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందని సమాచారం. సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తుండగా, సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. మహేష్ బాబుతో జతగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు బలమైన సమాచారం వినిపిస్తోంది.
ఇప్పటికే విలన్ పాత్రకు సంబంధించిన వివరాలను జక్కన్న టీమ్ వెల్లడించింది. హీరో, హీరోయిన్ లుక్స్‌తో పాటు టైటిల్ కూడా ఈ ఈవెంట్‌లో రిలీజ్ చేయనున్నట్లు టాక్ ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీకి "వారణాసి" అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ ఉంది. ఇంతకాలం ఎలాంటి హడావిడి లేకుండా రాజమౌళి సైలెంట్‌గా షూట్ చేసినట్లు సమాచారం.
'SSMB 29'ను రాజమౌళి ప్రపంచస్థాయి యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు. కథా నేపథ్యం "గ్లోబ్ ట్రాటింగ్ ఎక్స్‌ప్లోరర్" కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుంది. మహేష్ బాబు పాత్ర చాలా రగ్డ్, యాక్షన్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూట్ చేసే ప్లాన్ కూడా ఉంది. రాజమౌళి - మహేష్ కాంబినేషన్ అనేది టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకు గ్లోబల్ లెవెల్ హైప్ ఇచ్చే కలయిక. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నవంబర్ 15న జరిగే ఈవెంట్‌తో ఆ హైప్ మరింత రెట్టింపు కానుంది. మొత్తానికి 'SSMB 29' ఈవెంట్ టాలీవుడ్ చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











