మహేష్ బాబు పాస్‌పోర్ట్ సీజ్.. ఇక బందీగా అంటూ రాజమౌళి
ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టిన జక్కన్న .. స్క్రిప్ట్‌పై గత కొద్దినెలలుగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా మహేశ్ మూవీపై సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు ఎస్ఎస్ రాజమౌళి.
రాజమౌళి అంటేనే పని రాక్షసుడని పేరు.. తను అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకు నటీనటులను పిండేస్తారని ఆయనకు పేరు. రాజమౌళితో ఇప్పటి వరకు పనిచేసిన వారంతా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు కూడా. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో మేం పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అంటూ ఎన్టీఆర్, చరణ్ సరదాగా చెప్పేవారు. అలాంటి మహేశ్ వంటి రాకుమారుడు .. రాజమౌళిని తట్టుకోగలరా అంటూ సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వెల్లువెత్తాయి.

సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు మహేశ్ బాబు .. అలాగే కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. వీలున్నప్పుడల్లా కుటుంబంతో కలిసి విహారయాత్రలు, విదేశీ యాత్రలు చేస్తారు. మహేశ్ బాబు టూర్లకు సంబంధించి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఎన్టీఆర్ అడుగుతాడు. అన్నా మీరు ఏడాదికి మూడు , నాలుగు సార్లు ఫారిన్ వెళ్లిపోతారని ప్రశ్నిస్తాడు. మీలాంటి వాళ్లు దిష్టి పెట్టడంతో కరోనాతో ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చిందని పంచ్ విసిరుతారు మహేశ్ బాబు. ఇప్పుడు నిజంగానే మా సూపర్‌స్టార్‌కు దిష్టి తగిలిందని రాజమౌళి చేతికి చిక్కడంతో ఆయన సెట్స్‌కే పరిమితం అవుతారని అభిమానులు మీమ్స్ పెడుతున్నారు.
మహేశ్‌తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది? హీరోయిన్ ఎవరు? బడ్జెట్ ఎంత? ఎవరెవరు నటించబోతున్నారు? ఇలా ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వని జక్కన్న తాజాగా బాంబు పేల్చారు. సింహాన్ని జైల్లో లాక్ చేసినట్లు అర్ధం వచ్చేలా క్యాప్చర్ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో పాస్‌పోర్ట్ కూడా ఉండటంతో బహుశా .. మహేశ్ బాబు పాస్‌పోర్ట్‌ను జక్కన్న లాక్కొని ఉంటారని అభిమానులు అనుకుంటున్నారు. దీంతో రాజమౌళి సినిమా అయ్యే వరకు ఫారిన్ ట్రిప్‌లు, విహారయాత్రలు అన్ని కట్ అయ్యేనంటూ ప్రిన్స్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
ఈ వీడియోకు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి డైలాగ్‌ను రిప్లయ్‌గా పెట్టారు మహేశ్. అయితే ఆశ్చర్యకరంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా రిప్లయ్ ఇవ్వడంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లుగా కన్ఫర్మ్ అయిపోయింది. కొద్దిరోజుల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రియాంక రావడంతో మహేశ్ సినిమా కోసమే ఆమె ఇక్కడికి వచ్చారంటూ కామెంట్స్ వినిపించాయి. చివరికి అదే నిజమైంది.
ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే రాజమౌళి అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











