మహేష్ బాబు 50వ బర్త్ డే.. ఫాన్స్ కు రాజమౌళి గిఫ్ట్ ఏమిటో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక రకంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు. ఈరోజు మహేశ్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ప్లాన్ చేశారు? అంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న అభిమానులను ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేశారు రాజమౌళి. ఈ వివరాల్లోకి వెళితే..
ఎస్ఎస్ఎంబీ 29 బడ్జెట్ ఎంత?
దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వీ విజయేంద్ర ప్రసాద్.. ఎస్ఎస్ఎంబీ 29కి కథను అందిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌లు ఈ భారీ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతర క్యాస్ట్ అండ్ క్రూ, నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్ఎస్ఎంబీ 29 కథేంటీ?
ఇక ఎస్ఎస్ఎంబీ 29 కథ గురించి కూడా రకరకాల వాదనలు తెరమీదకి వస్తున్నాయి. రామాయణంలోని హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడిన సంజీవని మూలిక చుట్టూ ఈ కథ నడుస్తుందని.. కాదు కాదు కాశీ ఖండంతో లింక్ ఉందంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. ఇక ఎస్ఎస్ఎంబీ 29 సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన సెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

శరవేగంగా ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్
హైదరాబాద్, ఒడిషా, కెన్యా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం ప్రస్తుతం టాంజానియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మేకర్స్‌పై మహేశ్ అభిమానులు మండిపడుతున్నారు. రాజమౌళి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ సినిమా విశేషాల గురించి అడిగి విసిగించేస్తున్నారు. కనీసం మహేశ్ పుట్టినరోజు నాడైనా ఏదో ఒక అప్‌డేట్ ఉంటుందా? లేదా? అని ఆందోళనకు గురయ్యారు ప్రిన్స్ అభిమానులు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు రాజమౌళి.
మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్
మహేశ్ బాబు లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు జక్కన్న. అయితే ఇందులో మహేశ్ ఫేస్ కనిపించకుండా కేవలం ఛాతీ భాగమే కనిపిస్తోంది. అంతేకాదు.. ఛాతీపై కారుతున్న రక్తం, మెడలో ఓ మాలను ధరించాడు. ఈ మాల కింద భాగంలో శివుడి మూడో కన్ను, త్రిశూలం, ఢమరుకం, నంది, రుద్రాక్ష ఉన్నాయి. చూస్తుంటే మహేశ్ పోస్టర్ పూనకాలు తెప్పించేలా ఉంది. యాక్షన్ ఎడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆధ్యాత్మికంగానూ రాజమౌళి లింక్ చేసినట్లుగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాలకు తోడు ఈ పోస్టర్ ఎస్ఎస్ఎంబీ 29పై హైప్ పెంచేసింది.
నవంబర్‌లో ఫుల్ పోస్టర్
ఈ పోస్టర్ ఫుల్ పోస్టర్‌ను గ్లోబ్ ట్రోట్టర్ పేరుతో ఈ ఏడాది నవంబర్‌లో రివీల్ చేస్తానని రాజమౌళి తెలిపారు. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని.. ప్రెస్‌మీట్లు, ఏవో పోస్టర్లు షేర్ చేయడం వంటి పనులతో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేమన్నారు రాజమౌళి. ఈ సినిమా గురించిన విశేషాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మీ అందరిలో ఉంది.. అయితే మునుపెన్నడూ చూడని విధంగా దీనిని రూపొందిస్తున్నామని.. మీ ఓపికకు థ్యాంక్స్ అంటూ రాజమౌళి ఓ నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం మహేశ్ బాబు లుక్‌కి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











