SSMB 29: సోలోగా మహేశ్ బాబు.. ఫ్యాన్స్ కు ఫునకాలే.. జక్కన్న మాస్టర్ ప్లాన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకు తెలుగు రీజినల్ పరిధిలోనే సినిమాలు తీశారు. ఆయనకున్న క్రేజ్ కు ఇప్పటికే పదుల సంఖ్యలో పాన్ ఇండియాలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఇక ఎట్టకేలకు ఇండియాస్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ SSMB 29తో అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నెక్ట్స్ షెడ్యూల్ లో మహేశ్ బాబుతో ఇంట్రెస్టింగ్ షూట్ ను ప్రారంభించబోతున్నారంట జక్కన్న. ప్రస్తుతం ఆ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...
కెన్యా షెడ్యూల్ కు ఆటంకం?
SSMB 29 చిత్రాన్ని పాన్ వరల్డ్ చిత్రం నిర్మిస్తుండటంతో సినిమాలో కేవలం ఇండియాలోని లోకేషన్లనే కాకుండా ఫారీన్ లోనూ కథకు అనుకూలమైన ప్రాంతాల్లో షూటింగ్ ను జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటుడంతో అమెజాన్ అడవులు, సౌత్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలను షూటింగ్ కు ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల కెన్యాలో షూట్ చేయాలని రాజమౌళి టీమ్ యోచించింది. కానీ అక్కడ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో తాత్కాలికంగా ప్రస్తుత షెడ్యూల్ ను నిలిపివేసినట్టు తెలుస్తోంది.

మహేశ్ బాబుతో సోలో సాంగ్..
కెన్యా షెడ్యూల్ షూట్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతున్న వేళ.. మరోవైపు హైదరాబాద్ బయట ఓ సాంగ్ షూట్ కు ప్లాన్ చేస్తున్నారంట రాజమౌళి. అయితే సాంగ్ లో కేవలం మహేశ్ బాబు మాత్రమే ఉండేలా సోలో సాంగ్ ను షూట్ చేయబోతున్నారంట. ఇందు కోసం భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని ఇండస్ట్రీస్, డెవలప్ మెంట్ ను ప్రపంచ దేశాలకూ చూపించే ప్రయత్నం చేయబోతున్నారని టాక్. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్?
మహేశ్ బాబు SSMB 29 కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జక్కన్న సైతం బాహుబలి, ఆర్ఆర్ఆర్ ల కంటే ఈ చిత్రానికి మరింత కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మేర షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశారు. హైదరాబాద్, కర్ణాటక, ఒడిశా, సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరణ జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు, ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఆగస్టు9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.
ఫస్ట్ భారీ బడ్జెట్ ఫిల్మ్..
టాలీవుడ్ లోనే SSMB 29 చిత్రం తొలి 1000 కోట్ల బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు నిర్మాత కేఎల్ నారాయణ వెయ్యి కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుండటం విశేషం. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











