SSMB28: మహేశ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. సర్కారు వారి పాట కంటే ముందే!
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్నాడు మహేశ్ బాబు. దీనికితోడు కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్లతో సత్తా చాటిన అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. మధ్యలో పరాజయాల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ మహేశ్ బాబు సూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ జోష్‌తోనే ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా సినిమాల మీద సినిమాలను ఇప్పటికే లైన్‌లో పెట్టుకుని జెట్ స్పీడుతో ముందుకు దూసుకుపోతున్నాడు.
వరుసగా మూడు హిట్లతో ఫుల్ జోష్‌తో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు ఈ సినిమాను సంబంధించిన 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన దాని కోసం నేటి నుంచి షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఇక, ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో చాలా రోజుల పాటు దుబాయ్‌లోనే అతడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక, ఇండియాకు తిరగొచ్చిన వెంటనే కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయింది. ఇక, ఫిబ్రవరి 13 నుంచి ఈ స్టార్ హీరో సర్కారు వారి పాట షూట్‌లో పాల్గొనబోతున్నాడు.

పరశురాంతో సినిమా జరుగుతుండగానే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు ఓ సినిమాను ప్రకటించాడు. నిజానికి ఇది 'సర్కారు వారి పాట' పూర్తైన వెంటనే అంటే డిసెంబర్‌లోనే మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ చిత్రం కూడా పలు కారణాలతో అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. అంతేకాదు, ఇంకా కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్‌లు లేవని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రతిష్టాత్మక సినిమా గురించి ఓ అదిరిపోయే శుభవార్త బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రకటించిన సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 3వ తేదిన జరగబోతున్నాయట. కరోనా ప్రభావం దృష్ట్యా దీన్ని నిరాడంబరంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే దీనికి మహేశ్ బాబు సహా కొందరు యూనిట్ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారని అంటున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ మాత్రం మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతుందని కూడా ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. అప్పటి కల్లా మహేశ్ సర్కారు వారి పాటను పూర్తి చేసేస్తాడని టాక్.
ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, మోహన్ బాబు కీలక పాత్రను చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











