SSMB 28: త్రివిక్రమ్ పై మహేష్ అసహనం..షూటింగ్ క్యాన్సిల్..ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా ఆగిపోయింది అని మహేష్ అసలు ఏ మాత్రం సంతృప్తిగా లేడు అని అంతే కాకుండా మధ్య మధ్యలో మహేష్ హాలిడేస్ కారణంగా కూడా షూటింగ్ బ్రేకులు పడుతున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ గాసిప్స్ పై రీసెంట్ గా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక విధంగా అయినా కౌంటర్ అయితే గట్టిగానే ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

అనేక మలుపులు తిరిగి: త్రివిక్రమ్ అల..వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇక మొత్తానికి మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటికీ అది అనేక రకాల మలుపులతో మొదలైంది. మొదట అనుకున్న షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక మళ్ళీ సరికొత్త కథతో షూటింగ్ మొదలుపెట్టారు అని ఒక టాక్ అయితే వినిపించింది.

షూటింగ్ ఆగిపోయిందా?: అయితే ఇటీవల మహేష్ బాబు కారణంగా మరోసారి సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లుగా గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహేష్ అయితే ఇప్పటివరకు జరిగిన షూటింగ్ విషయంలో ఏమాత్రం సంతృప్తిగా లేడు అని అందుకే మరోసారి అతను నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ అయితే వచ్చింది. అయితే ఈ రూమర్స్ కారణంగా సినిమా నిజంగానే ఆగిపోతుందేమో అనే విధంగా కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి.

స్పందించిన నిర్మాత నాగవంశీ: ఇక మొత్తానికి నిర్మాత నాగ వంశీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొదటి ట్వీట్ లో ఆయన ఈ విధంగా స్పందించారు. ఆహారం కోసం ప్రయాణించే పక్షులు కాస్త గట్టిగా చప్పుడు చేస్తూ ఉంటాయి.
అలాగే ఎవరైనా అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు కూడా పుకార్లు ఈ విధంగా విస్తరింప చేస్తూ ఉంటారు. వాటిని చూసుకొని నవ్వుకోవాలి అలాగే వీలైతే వదిలేయాలి. మన పని మనం చేసుకుంటూ వెళుతూ ఉండాలి.. అని అన్నారు.
బలంగా గుర్తుపెట్టుకోండి.. పక్కా బ్లాక్ బస్టర్: ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం SSMB 28వ సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలానే ఉంటుంది. మీరు గాసిప్స్ వినాలనుకుంటే వినండి కానీ ఈ ఒక్క విషయం మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి. ఈ గాసిప్స్ రాయుళ్ళు సినిమాలు చేస్తే మూవీ ఇండస్ట్రీకి ఉపయోగకరంగా ఉంటుందేమో. ఇక SSMB28 పక్క బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది ఇది నా మాటకు గుర్తు పెట్టుకోండి అంటూ నాగ వంశీ వివరణ ఇచ్చాడు.
అప్డేట్ వచ్చేది అప్పుడే..: ఇక SSMB 28 కచ్చితంగా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకి 2024 లో వస్తుంది. ఈ సినిమా విషయంలో అయితే మేము ప్రశాంతంగా పని చేయాలని అనుకుంటున్నాము. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ మే 31వ తేదీన వస్తుంది అని అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి.. అని నాగ వంశీ మరొక ట్వీట్ లో చాలా క్లుప్తంగా వివరణ అయితే ఇచ్చారు.


Click it and Unblock the Notifications











