నానికి వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి.. అలా చేయడంతో చిర్రెత్తిపోయిన జక్కన్న

నేచురల్ స్టార్ నాని, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మధ్య మంచి అనుబంధం కనిపిస్తూ ఉంటుంది. అయితే నాని ప్రస్తుతం ఇంతటి స్థాయికి చేరుకోవడానికి జక్కన్న సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాని చేస్తున్న సినిమాలపై ఎస్ఎస్ రాజమౌళి ఒక సందర్భంలో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఎస్ఎస్ రాజమౌళితో నానికి ఉన్న అనుబంధం..
ఎస్ఎస్ రాజమౌళితో నానికి 2012 కంటే ముందే పరిచయం ఏర్పడింది. నాని మంచితనంతో రాజమౌళి తన కుటుంబానికి పరిచయం చేశారు. ప్రస్తుతం ఒకే కుటుంబంలా ఫీల్ అవుతూ ఉంటారు. నాని తీసే ప్రతి సినిమాకు రాజమౌళి కుటుంబం నుంచి ఫస్ట్ రివ్యూ తీసుకుంటాడు నాని. అంతే కాదు స్టోరీల విషయంలోనూ రాజమౌళి సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటాడు.

SSMB29 director Rajamouli warns actor Nani

ఎస్ఎస్ రాజమౌళి - నాని సినిమాలు..
ఎస్ఎస్ రాజమౌళితో నాని ఒక బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ చేసిన సంగతి తెలిసిందే. అదే ఈగ. సమంత హీరోయిన్ గా నటించింది. 2012లో వచ్చిన ఈ చిత్రంలో నాని కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటారు. కానీ నానికి రాజమౌళి ఎంతటి ఎలివేషన్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తర్వాత నాని కెరియర్ దెబ్బకు మారిపోయింది. నాని పిక్ చేసుకునే స్టోరీలు కూడా మంచి రిజల్ట్ ను అందుకుంటున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు నాని. ఇక ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'లోనూ నానికి కీలక పాత్ర కన్ఫమ్ చేశారు.

నానికి వార్నింగ్ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి..
రాజమౌళితో ఎంతో సన్నిహితంగా ఉండే నేచురల్ స్టార్ నాని.. ఒక విషయంలో జక్కన్నకు కోపం తెప్పించాడంట. నాని ఈగ చిత్రం తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఏటో వెళ్లిపోయింది మనస్సు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మొగాడివో వంటి చిత్రాలతో మంచి హిట్స్ ను అందుకున్నాడు. కానీ అదే మూసధోరణిలో సినిమాలు చేస్తూ ఉన్నాడని, ఓకే జోనర్ లో సినిమాలు చేస్తున్నాడని ఎస్ఎస్ రాజమౌళికి కోసం వచ్చిందంట. ఒక రోజు రాత్రి తనకు లాంగ్ మెసెజ్ పెట్టి మరీ ఇంకా మంచి సినిమాలు చేయాలని, జోనర్ మార్చాలని హెచ్చరించాడంట రాజమౌళి. అప్పటి నుంచే నాని డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక రీసెంట్ గా హిట్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదే రాజమౌళిలో నాని చేస్తున్న సినిమాలపై ప్రశంసలు కురిపించడం విశేషం.

నాని హిట్ 3 సినిమా విషయాలు..
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి రూ.60 కోట్ల బడ్జెట్ ను వెచ్చించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే1న గ్రాండ్ గా విడుదలైంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.70కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: ss rajamouli nani hit 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X