Globe Trotter Event: అలాగైతే రావొద్దు.. ఫాన్స్ కు మహేశ్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్
Globe Trotter Event: సూపర్ స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న'గ్లోబ్ ట్రాటర్' (SSMB29) ప్రాజెక్ట్ గురించి ప్రతీ చిన్న అప్‌డేట్ ఒక సంచలనమే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే పాన్ వరల్డ్ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన తొలి మెగా ఈవెంట్ 'గ్లోబ్ ట్రాటర్'(Globe Trotter) నవంబర్ 15న రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగనున్నది. ఈ ఈవెంట్‌పై ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో అభిమానులు భారీగా ఈవెంట్‌కు తరలివచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో హీరో మహేశ్ బాబు స్వయంగా ముందుకు వచ్చి ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
'గ్లోబ్ ట్రాటర్' (Globe Trotter) ఈవెంట్‌పై ఓ స్పెషల్ వీడియోలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. "ఈవెంట్‌కు పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్) ఉన్నవాళ్లకే ఎంట్రీ ఉంటుంది. పాస్ లేకుండా ఎవ్వరూ రాకండి. దయచేసి కంగారుపడి వచ్చేయకండి" అని చెప్పారు. ఇది కేవలం నియమం మాత్రమే కాకుండా, అభిమానుల భద్రత కోసం తప్పనిసరి చర్య అని వివరించారు. అభిమానుల్లో కనిపిస్తున్న జోష్ కారణంగా ఏర్పడే రద్దీని అదుపులో ఉంచడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఆ తర్వాత ఈవెంట్‌లో ఎంట్రీ ఎలా ఉంటుందో వివరించారు.

"ఆర్ఎఫ్‌సీ మెయిన్ గేట్ ఈవెంట్ రోజున మూసి ఉంటుంది. మీ పాస్ స్కాన్ చేస్తే మీరు ఎక్కడి గేట్ నుంచి రావాలో కనిపిస్తుంది. అదే గేట్ నుంచి మాత్రమే వెళ్లండి." అని అభ్యర్థించారు. ఈవెంట్‌లో డిసిప్లిన్ పాటించడంపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. "పోలీసులకు, సెక్యూరిటీ టీమ్‌కి సహకరించండి. వీలైతే తక్కువ వాహనాలతో రండి. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కి ఇది చాలా అవసరం. పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి. మనకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం' అని మహేశ్ బాబు చెప్పారు.
'గ్లోబ్ ట్రాటర్' (Globe Trotter)ఈవెంట్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మహేశ్ బాబు త్రిశూలం లుక్‌తో, రాజమౌళి, మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ ఫోటోలతో డిజైన్ చేసిన ఈ "పాస్‌పోర్ట్ స్టైల్ పాస్‌లు" అభిమానుల్లో పెద్ద క్రేజ్‌కి కారణమయ్యాయి. పాస్ తెరవగానే లోపల ఈవెంట్ మ్యాప్, గైడ్‌లైన్స్, రూల్స్ అన్నీ ఉండటంతో అభిమానులు వీటిని కలెక్టబుల్ ఐటెమ్‌లా భావిస్తున్నారు. ఈ పాస్‌ల అన్‌బాక్సింగ్ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇప్పటికే రాజమౌళి కూడా ముందుగా వీడియో విడుదల చేసి అభిమానులకు సూచనలు ఇచ్చారు. "ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫేక్ పోస్టులను నమ్మవద్దు. చిన్న గొడవ జరిగినా ఈవెంట్ క్యాన్సిల్ అవుతుంది." అని స్పష్టం చేశారు. ఇప్పుడు మహేశ్ కూడా అదే దారిలో అభిమానులను జాగ్రత్తలు పాటించాలని కోరడం, ఈవెంట్‌కు టీమ్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నదానికి ఇది నిదర్శనమనే చెప్పాలి.
SSMB29 మెగా ఈవెంట్‌ను ఇండియాలో ఉన్నవారు జియో హాట్ స్టార్ (Jio Hotstar), విదేశాల్లో వేరైటీ మ్యాగాజీన్ యూ ట్యూబ్ ( Variety Magazine YouTube) ఛానెల్‌లలో లైవ్ స్ట్రీం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో కీరవాణి స్వరపరిచిన "సంచారి" పాటను శ్రుతి హాసన్ స్టేజ్‌పై లైవ్‌గా పాడబోతోంది. అలాగే మహేశ్ బాబు లుక్, ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియో లాంచ్ చేయనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం లక్ష్యంగా రాజమౌళి టీమ్ ప్లాన్స్ వేస్తోంది.


Click it and Unblock the Notifications











