SSMB29: మహేష్ ఫ్యాన్స్‌కు కీరవాణి షాక్.. మహేష్, రాజమౌళి మూవీ ఏం చెప్పాడంటే?

మావెరిక్ చిత్రనిర్మాత రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా మూవీ లవర్స్. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఇప్పటిదాకా అస్సలు ప్రాజెక్టును లాంచ్ చేయలేదు జక్కన్న. తాజాగా కీరవాణి బయట పెట్టిన అప్డేట్ తెలిసి షాక్ అవుతున్నారు. మరి మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టేలా కీరవాణి ఇచ్చిన అప్డేట్ ఏంటి ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

మహేష్ - రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాకు తాత్కాలికంగా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. మహేష్ బాబు ప్రస్తుతం లుక్స్ పరంగా తన బెస్ట్ వెర్షన్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. అంటే ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా మేకోవర్ అవుతున్నాడు. దాని కోసం సెపరేట్ గా ట్రైనింగ్, వర్కౌట్స్, డైట్ ఫాలో అవుతున్న విషయ తెలిసిందే.

SSMB29 Movie Update MM Keeravani gives Update on Mahesh Babu SS Rajamouli Combo

కాగా దాదాపు 9 నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే నెలాఖరులోగా షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనుకోని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌కు వాయిదా పడింది. మరి ఇన్ని నెలల్లో రాజమౌళి ఏం చేశాడు అంటే.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశాడు. లొకేషన్స్, నటీనటులను కూడా ఫిక్స్ చేశాడు.

మరోవైపు సినిమాలోని వివిధ సన్నివేశాల కోసం మహేష్ బాబు వర్క్‌షాప్‌ను ప్రారంభించాడు. ఈ గ్యాప్‌లో యాడ్స్ చేస్తూనే, విదేశాలకు ట్రిప్పులు కూడా వేస్తున్నాడు. అయితే SSMB29కి సంబంధించి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న. అందుకే మహేష్ బయట కన్పించడం తప్ప ఎలాంటి లీక్స్ రావట్లేదు. కానీ తాజాగా కీరవాణి ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చి మహేష్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చారు.

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ "నేను ఇంకా SSMB29 ప్రాజెక్ట్‌పై పని చేయడం ప్రారంభించలేదు. ఎందుకంటే ఈ వారం కథ లాక్ అవుతుంది. ఇంకా కొన్ని టెస్ట్ షూట్‌లు జరుగుతున్నాయి" అంటూ కీలకమైన అప్డేట్ ఇచ్చారు. దీంతో ఇంకా టెస్ట్ లుక్కే పూర్తి కాలేదా? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ఈ మూవీ గురించి ఆలోచించడం కంటే జక్కన్న అప్డేట్ ఇచ్చేదాకా వెయిట్ చేయడం మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా SSMB29 చిత్రం జంగిల్ అడ్వెంచర్ గా రూపొందనుంది. ఆఫ్రికా అడవులలో కొనసాగే కథతో రాజమౌళి ఫారెస్ట్ యాక్షన్-అడ్వెంచర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురనున్నారు. ఇందులో మహేష్ సాహసికుడిగా నటించనున్నారు. సినిమాలో నటించే నటీనటులు, టెక్నీషియన్ల డీటైల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ ఈ భారీ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రం మే 2026లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X