రాజమౌళికి పోలీస్ కమిషనర్ సీరియస్ వార్నింగ్.. అలా జరిగితే ఈవెంట్ రద్దు అంటూ

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు.

ఫిలింసిటీలో గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్
ఈ సినిమా టైటిల్, మహేశ్ బాబు లుక్‌ను నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ ప్రసార హక్కులను జియో హాట్‌స్టార్‌కి విక్రయించి సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఇప్పటికే సినిమాపై హైప్ పెంచేలా పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు జక్కన్న. దాంతో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలాగే మహేశ్ లుక్ ఎలా ఉండబోతోంది? టైటిల్ ఏంటీ? అనే దానిపైనా రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో జరిగే గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌కు భారీగా అభిమానులు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

SSMB29 SS Rajamouli warns Mahesh Babu Fans and issues strict guidelines for Globetrotter event at Ramoji Film City

ఓపెన్ ఈవెంట్ కాదు
అందరికీ నమస్కారం.. మన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ కోసం మీరంతా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా చాలా ఎగ్జయిటింగ్‌తో ఉన్నాను, మన ఈవెంట్ బాగా జరగాలంటే మీరందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా... మనందరి సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు ఈసారి చాలా స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు.. ఫిజికల్ పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే మన ఈవెంట్‌కి రావాలి. నేను కొన్ని వీడియోలు చూశాను.. ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరైనా రావొచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని అలో చేస్తారు, అలాగే ఆన్‌లైన్‌లో పాసులు అమ్ముతున్నారు అని చెబుతున్నారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని రాజమౌళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ రూట్‌లో రావాల్సిందే
ఫిజికల్ పాసులు అందజేయబడతాయి. అవి ఉన్నవాళ్లు మాత్రమే రావాలి..15వ తారీఖున విజయవాడ హైవే మీదున్న రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. మన ఈవెంట్‌కి ఎలా రావాలి అంటే.. విజయవాడ నుంచి వచ్చే వాళ్లు... రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ కంటే ముందే లెఫ్ట్ తీసుకోవాలి, ఆ రోడ్ అనాస్‌పూర్‌కి వెళ్తుంది. అనాస్‌పూర్ నుంచి మన ఈవెంట్‌ బ్యాక్ సైడ్‌కి వస్తుంది. అలాగే ఎల్‌బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్లు.. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుని, సర్వీస్ రోడ్‌లో నుంచి సాంగ్లీ టెంపుల్ మీదుగా మన ఈవెంట్ లోకి రావొచ్చు. గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కిందకి దిగిపోయి సర్వీస్ రోడ్‌లోకి వచ్చి రైట్‌కి తీసుకుంటే సాంగ్లీ నుంచి మన ఈవెంట్‌కి వస్తారు అని రాజమౌళి తెలిపారు.

క్యూఆర్ కోడ్‌లో అన్ని వివరాలు
మన పాసెస్ ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది.. దానిని స్కాన్ చేస్తే, క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలు ఉంటాయి. మన రోడ్ మొత్తం వీడియో తీయబడి ఉంటుంది. వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతాయి. ఇవే కాకుండా.. మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి.. పార్కింగ్ వరకు సైన్ బోర్డ్స్ చూపిస్తాయి. మన ఫ్రెండ్స్‌లో కొందరుంటారు.. నాకు షార్ట్ కట్ తెలుసు, ఇలా వెళ్లిపోదాం రా అని చెప్పేవాడు ఒకడుంటాడు. వాళ్ల మాటలు నమ్మొద్దు... మన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం, హ్యాపీగా, క్లియర్‌గా మనం పార్కింగ్‌కి చేరుకుందాం. మన ఈవెంట్‌కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏవైతే ఉన్నాయో, అవి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. త్వరగా వస్తే పార్కింగ్ ప్లేస్‌లలో మంచి స్పాట్‌లు దొరుకుతాయి, ఈవెంట్‌లో మంచి సీట్స్ కూడా దొరుకుతాయి అని జక్కన్న అన్నారు.

ఓవరాక్షన్ చేస్తే ఈవెంట్ రద్దు
18 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారికి, సీనియర్ సిటిజన్స్‌కి ఈసారి పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వలేదు. వీరంతా ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ జియో హాట్ స్టార్ ప్రత్యక్షంగా ఈ ఈవెంట్ చూడండి. రీసెంట్‌గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీస్ వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉండబోతున్నారు, కమీషనర్ గారు పర్సనల్‌గా చెప్పారు. ఏమాత్రం అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్‌ను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్‌ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్యూ.. నవంబర్ 15న కలుద్దామని రాజమౌళి ముగించారు. దీంతో గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌కి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఈవెంట్ రద్దు జరుగుతుందని మహేశ్ అభిమానులకు రాజమౌళి వార్నింగ్ ఇచ్చారు.

More from Filmibeat

Read more about: ssmb29 rajamouli mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X