వైఎస్ జగన్‌పై స్టాండప్ కమెడియన్ పంచులే పంచులు.. ఈ సెటైరికల్ వీడియో చూసి నవ్వుకొని చస్తే బాధ్యత ఎవరిది?
ఎన్నికల సీజన్‌లో విమర్శులు, సెటైర్లు, వ్యంగాస్త్రాలు వదలడం రాజకీయ నాయకులు, సినిమా వాళ్లకు సర్వసాధారణమే. ఎలక్షన్స్ వచ్చాయంటే.. రాజకీయ నేతలపై సినిమా రంగానికి చెందిన వాళ్లు విమర్శనాత్మక ధోరణిలో మూవీస్ తీయడం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. అయితే మీడియా పరిధి పెరిగిన క్రమంలో మీమర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లు, స్టాండప్ కమెడియన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఓ స్టాండప్ కమెడియన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
స్టాండప్ కామెడీ షోలో భాగంగా ఓ కమెడియన్ మాట్లాడుతూ.. నేను వైజాగ్‌కు తరచుగా వచ్చే వాడిని. కానీ ఈ మధ్య రావడం మానేశాను. అయితే చిన్న గ్యాప్ ఇచ్చి ఏ నగరానికైనా వెళ్తే.. ఆ నగరం చాలా చిన్నదైనదనే ఫీల్ కలుగుతుంది అని అనగానే.. ప్రేక్షకుల్లోంచి ఒకరు జై జగన్ అని సెటైర్ వేశాడు. దాంతో.. వైజాగ్ నగరం అభివృద్ది చెందకపోవడానికి అదో కారణం కావొచ్చు అని కమెడియన్ కామెంట్ చేశాడు.

వైజాగ్‌కు వెళ్లగానే.. నాకు చాలా చిన్నదైనదనిపించిన వాటిలో రుషి కొండ ఒకటి. ఆ కొండ చాలా చిన్నగా అయిపోయింది. నాకు నచ్చే గీతం కాలేజ్.. ఓపెన్ యూనివర్సిటీ అయిపోయింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీలోకి ఎవరైనా అడుగుపెట్టవచ్చు అంటూ మరో సెటైర్ వేశాడు.
ఇక వైజాగ్‌లో నేను చూసింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. పేరుకు తగినట్టే అది ఫ్లోటింగ్‌లో బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అలా కొట్టుకుపోతుంటే మనం చేతులు కొట్టుకొని నిలుచొని చూడాల్సిందే. ఇలా వైజాగ్ గురించి ముఖ్యంగా ఆంధ్రా గురించి నిజాయితీగా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తన మీద తానే సైటెర్ వేసుకొన్నాడు.

ఇలా వైజాగ్ గురించి మాట్లాడితే.. మీరు హార్ట్ అవుతారేమో.. మనోభావాలు దెబ్బ తినొచ్చు. సీఎం మీద రాళ్లు విసిరినట్టే.. నా మీద రాళ్లు వేస్తారేమో. నాది అసలే బట్టతల. నన్ను కొట్టే బదులు.. బట్టతలోడా అని తిట్టి వెళ్లండి. నాకు బాడీ షేమింగ్ ఒకే.. బాడీ హార్మింగ్ తట్టుకోలేను అంటూ పంచులు వేశాడు.
స్టాండప్ కామెడీ షో అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్లాలి. మా ఇల్లు ఇక్కడికి 4 కిలోమీటర్లు. నాలుగు కిలోమీటర్లు నడుచుకొంటూ వెళ్లాలి. ఆ 4 కిలో మీటర్లు ప్రయాణించడానికి నేను హెలికాఫ్టర్‌ను తీసుకొని వెళ్లలేను అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











