ఫ్యాన్స్ కోపాన్ని తగ్గించేందుకు ప్రభాస్ న్యూ ప్లాన్.. త్వరలోనే బిగ్ న్యూస్!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా ఆగ్రహానికి లోనవుతున్నారు. బాహుబలి నుంచి ఓపిక పట్టడం అలవాటు చేసుకున్న ఈ స్టార్ హీరో అభిమానులకు రీసెంట్ గా ఆ ఓపిక నశించింది. ప్రభాస్ నిర్మాతలపై సోషల్ మీడియాలో తీవ్రమైన స్థాయిలో ఆగ్రహాన్ని చూపించారు. ఈ కోపానికి ప్రభాస్ టీమ్ ముఖ్య కారణమని చెప్పవచ్చు.

Recommended Video

Prabhas20 Title And First Look In May ! Movie Makers Over Fans Trolls
 ఓపిక నశించింది..

ఓపిక నశించింది..

మిగతా హీరోల సినిమా యూనిట్స్.. వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటే ప్రభాస్ టీమ్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ప్రతిసారి ఎదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటోంది. ఒకవేళ చిన్న అప్డేట్ ఇచ్చినప్పటికీ అది ఫ్యాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పిస్తోందే గాని ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వడం లేదు.

 రెండేళ్లవుతోంది ఇంకా టైటిల్ దొరకలేదా?

రెండేళ్లవుతోంది ఇంకా టైటిల్ దొరకలేదా?

సాహో సినిమా తరువాత ప్రభాస్ రాధాకృష్ణ సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమా సాహూ కంటే ముందే చర్చలకు వచ్చింది. అప్పుడే దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా స్టార్ట్ చేసిన ప్రభాస్ 20వ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా టైటిల్ దొరకలేదా అని ఫ్యాన్స్ ఈ మధ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూవీ క్రియేషన్స్ బ్యాన్..

యూవీ క్రియేషన్స్ బ్యాన్..

ప్రభాస్ సాహో సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఆలస్యం చేసిన యూవీ క్రియేషన్స్ సరైన రీతిలో సినిమాను అభిమానులకు అందించలేకపోయింది. ఇక ప్రభాస్ 20వ సినిమానైనా తొందరగా అందిస్తారు అనుకుంటే కనీసం టైటిల్ కూడా ఎనౌన్స్ చేయలేదు. దీంతో ఆ సంస్థను బ్యాన్ చేయాలని అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్యాగ్స్ వైరల్ చేశారు.

ప్రభాస్ న్యూ ప్లాన్..

ప్రభాస్ న్యూ ప్లాన్..

ఫైనల్ గా ప్రభాస్ అభిమానుల ఆగ్రహం గురించి తెలుసుకొని ఒక ప్లాన్ వేశాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఫైనల్ టైటిల్ ని ఎనౌన్స్ చేయించేందుకు రెడీ అయ్యారట. ఆ తరువాత చిన్న టీజర్ లాంటి క్లిప్ ని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చారట. మొత్తానికి అభిమానుల కోపాన్ని తగ్గించేందుకు ప్రభాస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X