స్టేజ్ మేనర్స్ తెలియదా? విజయ్ దేవరకొండను కెలికిన అనసూయ
సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్.. చిన్నాచితకా షోలు చేసుకుంటూ కొనసాగుతున్న దశలో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. జడ్జిలుగా నాగబాబు- రోజా, కంటెస్టెంట్స్ టాలెంట్‌కు తోడు అనసూయ అందచందాలు జబర్దస్త్ బాగా పాపులర్ అవ్వడానికి ఓ రీజన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రోగ్రామ్ మధ్యలో అనసూయ వేసే జోకులు, సమయస్పూర్తితో ఆమెకు మంచిపేరే వచ్చింది.
జబర్దస్త్‌తో పాటు పలు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు హోస్ట్‌గా తెలుగు లోగిళ్లకు బాగా చేరువయ్యారు అనసూయ. ఈ పాపులారిటీతో సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె సినీ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ వెంటనే భారీ ప్రాజెక్ట్‌ల్లో ఛాన్స్‌లు పోటెత్తాయి. ఈ దశలోనే సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చిన పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు అనసూయ.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే అనసూయ.. తన సినిమాలు, షోల వివరాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తరచుగా ఇన్‌స్టా, ట్విట్టర్ లైవ్‌లు నిర్వహించి అభిమానులతో టచ్‌లో ఉంటారు. అయితే ఆ సమయంలో ఎవరైనా అత్యుత్సాహంతో నోరు జారాడో ఇక అంతే సంగతులు .. అతని అంతు చూసే వరకు అనసూయ వదిలిపెట్టరు. మరీ ముఖ్యంగా తనను ఆంటీ అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు.
గతంలో అనసూయకి, హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిన సంగతి తెలిసిందే. తనను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని , ట్రోలింగ్‌కు దిగుతున్నారంటూ ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విజయ్ ఫ్యాన్స్ తగ్గపోగా.. ట్రోలింగ్ మోతాదును మరింత పెంచారు. తర్వాత ఇరు పక్షాలు శాంతించడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఇప్పటికీ అనసూయ ఏదైనా మీడియా మీట్‌లో పాల్గొన్నా, ఇంటర్వ్యూ ఇచ్చినా ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్‌తో గొడవపై ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

చాలా రోజుల తర్వాత అనసూయ- విజయ్ దేవరకొండ వ్యవహారం తెరపైకి వచ్చింది. సింబా అనే మూవీలో ఈ స్టార్ యాంకర్ నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులోని ఓ సీన్‌లో అనసూయ టూ వీలర్‌పై వస్తుండగా , ఒకతను ఆమె బండి తుడుస్తూనంటూ వచ్చి.. అక్క నీకు మహేష్ బాబు లాంటి మొగుడొస్తాడని చెబుతాడు. దీనికి అనసూయ మొహం అదో రకంగా పెట్టుకుంటుంది.. దీనిని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే అక్కా నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడని అంటాడు. దీంతో ఆమె ముఖంలో నవ్వులు కనిపిస్తాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు ట్రోలింగ్‌కు దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు .. ఈ సీన్ గురించి ప్రశ్నించడంతో అనసూయ క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, కథలో భాగంగా ఓ సన్నివేశంలో భాగంగానే ఆ డైలాగ్ ఉందన్నారు. తాను ఈ విషయంపై స్పందించాలని అనుకోవడం లేదని.. మా మధ్య కూడా అందరూ అనుకునేంత పెద్ద గొడవ జరగలేదని అనసూయ పేర్కొన్నారు. స్టేజ్ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చిందని.. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలని, ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని అనసూయ తెలిపారు. అప్పుడు ఎవరూ స్పందించకపోవడంతో తాను జోక్యం చేసుకుని మాట్లాడానని.. అంతకుమించి తనకు ఎవరి మీదా కోపం లేదని అనసూయ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











