మన్మథుడు 2లో లవంగం ఎవరో తెలుసా!

కింగ్ నాగార్జున త్వరలో నటించబోయే చిత్రం మన్మథుడు 2. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించబోతున్నారు. ఇటీవల మన్మథుడు 2 చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరగబోతోంది. మన్మథుడు చిత్రం నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటి.

ఈ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 తెరకెక్కుతుండడంతో ఆసక్తి నెలకొని ఉంది. నాగార్జున సరసన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మన్మథుడు చిత్రంలో బ్రహ్మానందం లవంగం పాత్రలో నటించి కడుపుబ్బా నవ్వించారు. త్రివిక్రమ్ రాసిన కామెడీ పంచులు అప్పట్లో బ్రహ్మి నోట అద్భుతంగా పేలాయి. ఈ లవంగం పాత్రని మన్మథుడు 2లో కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Star comedian will going to play Lavangam role in Manmadhudu2 movie

కానీ ఆ పాత్రలో బ్రహ్మి నటించడం లేదు. లవంగం పాత్రలో కమెడియన్ వెన్నెల కిషోర్ నటిస్తాడట. వెన్నెల కిషోర్ తన భావ భావాలు, కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు లవంగం పాత్రలో బ్రహ్మీని మురిపించేలా నటిస్తాడా అనే విషయం తెలియాలంటే మన్మథుడు 2 విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X