మిరాయ్ లో రాముడిగా స్టార్ హీరో.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ విజయపథంలో నడుస్తున్నారు. తన చేసే ప్రతి చిత్రం ఇటు ప్రేక్షకుల్లో అటు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను దక్కించుకునేలా చూస్తున్నారు. చివరిగా తేజా సజ్జా హీరోగా వచ్చిన హను-మ్యాన్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కించుకున్నారు. దీంతో నెక్ట్స్ రాబోతున్న యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ మిరాయ్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా విడుదలైన మిరాయ్ ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకో కలిగారు. ఇదే సమయంలో మిరాయ్ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

ఆగస్టు 28న మిరాయ్ చిత్రానికి సంబంధించిన పవర్ ఫుల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్, తేజా సజ్జా, మంచు మనోజ్ లుక్, శ్రియా సరన్ రోల్, జగపతి బాబు పాత్రపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. ఇదే సమయంలో కథకు అనుగుణంగా శ్రీరాముడి పాత్ర కూడా ఉండబోతుందని ట్రైలర్ లో చూపించారు. అయితే ట్రైలర్‌లో అన్ని అంశాల కంటే ఎక్కువగా శ్రీరాముడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనేది ఆస్తికరంగా మారింది. ట్రైలర్ కట్ లో ఆ పాత్రను ఎవరు పోషించారనేది చూపించలేదు.

Star Hero in Teja Sajja Mirai Movie

దీంతో మిరాయ్ చిత్రంలో శ్రీరాముడి పాత్రను టాలీవుడ్ లోని స్టార్ హీరో పోషించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మిరాయ్ ప్రెస్ మీట్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్పందించారు. శ్రీరాముడి పాత్రలో ఎలాంటి స్టార్ హీరో లేరని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి స్టార్ ఉండని చెప్పారు. కానీ మరికొందరు మాత్రం కావాలనే ఆ విషయం బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారని, సినిమాలో సస్పెన్స్ గా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తేగానీ దీనిపై సరైనా క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఇక తేజా సజ్జా చివరిగా నటించిన సూపర్ హీరో ఫిల్మ్ హను-మాన్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా దక్కడం విశేషం. విజువల్స్ విషయంలో జాతీయ పురస్కారం అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా 40 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. కాగా, ప్రస్తుతం మిరాయ్ చిత్రం తేజా సజ్జాకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మిరాయ్ చిత్రాన్ని సౌత్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించారు. నిర్మాత టీవీ విశ్వ ప్రసాద్ రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రీయా సరన్, జగపతి బాబు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి, మరాఠి భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 2025 సెప్టెంబర్ 12న విడుదల అవుతుంది.

More from Filmibeat

Read more about: teja sajja mirai sriya saran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X