Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సంక్రాంతికి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న బాలయ్య, ప్రభాస్.. పవన్ కూడా జాయిన్ అవుతాడట!
సినిమా ఇండస్ట్రీలో కరోనా వైరస్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. హాలీవుడ్ అయితే ఏకంగా 70% బిజినెస్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక మన టాలీవుడ్ లో ఈ ఏడాది మహేష్, అల్లు అర్జున్, నితిన్ తప్పితే ఏ హీరో కూడా బాక్సాఫీస్ పెద్దగా వండర్స్ క్రియేట్ చేయలేకపోయారు. ఇక థియేటర్స్ ఓపెన్ కావడంతో ఇయర్ ఎండ్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ఒక మంచి కిక్కిచ్చాడు. ఇక నెక్స్ట్ సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలతో పాటు అగ్ర హీరోలు కూడా సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
రిస్క్ చేయడానికి ధైర్యం చేయలేదు
సంక్రాంతి అనగానే ప్రతి ఏడాది టాలీవుడ్ కు ఒక బాక్సాఫీస్ పండగేనని చెప్పాలి. ఈ ఫెస్టివల్ సెంటిమెంట్ తో ఎంతో మంది అగ్ర హీరోలు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. అయితే ఈ సారి మాత్రం మన అగ్ర హీరోలు రిస్క్ చేయడానికి ధైర్యం చేయలేదు. వీలైనంత వరకు నెమ్మదిగానే రావాలని డిసైడ్ అయ్యారు.
ఇంట్రెస్టింగ్ జిక్క్ మారిన సంక్రాంతి ఫైట్
సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ లో చిన్న సినిమాలు అలాగే మీడియం బడ్జెట్ సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. రామ్ నటించిన రెడ్ సినిమాతో పాటు రవితేజ క్రాక్ సినిమా ఒకరోజు గ్యాప్ లో సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అలాగే బెల్లంకొండ అల్లుడు అదుర్స్, అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమాలు కూడా సంక్రాంతి పోటీకి సిద్ధమయ్యాయి.
మొదట బాలయ్య సర్ ప్రైజ్
బాక్సాఫీస్ ఫైట్ గురించి టాక్ ఎలా ఉన్నా కూడా సంక్రాంతి రోజున అగ్ర హీరోలు మాత్రం ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముందుకు నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒకక్ సినిమా చేస్తున్న బాలయ్య ఆ సినిమా తరువాత డిక్టేటర్ ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు సమాచారం. అదే ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు టాక్.
వకీల్ సాబ్ కూడా..
ఇక ప్రభాస్, పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ న్యూస్ తో అభిమానులకు మంచి కిక్కివ్వాలని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారాట. ఇక అదే రోజు సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ 2021 ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్.
ప్రభాస్ ఏం చేయబోతున్నాడంటే..
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ అయితే చాలానే వస్తాయని అభిమానులు వేయిట్ చేస్తున్నారు. ముందుగా రాధేశ్యామ్ యొక్క టీజర్ ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఆ టీజర్ ద్వారానే రిలీజ్ పై కూడా కూడా క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.