‘టక్ జగదీష్’లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్: నాని సినిమాలో మొదటిసారి అలా
కెరీర్ ఆరంభం నుంచే వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే, ఈ మధ్య కాస్త వేగం తగ్గించిన అతడు.. మళ్లీ స్పీడు పెంచేశాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'టక్ జగదీష్' ఒకటి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ సర్‌ప్రైజ్ పార్ట్ గురించి తాజాగా వివరాలు బయటకు వచ్చాయి.
ప్రేమకథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ. అతడి డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న రెండో చిత్రమే 'టక్ జగదీష్'. కుటుంబ కథా చిత్రంగా రాబోతున్న ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని సర్‌ప్రైజ్‌గా ఉంచాలని చిత్ర యూనిట్ భావించిందట. కానీ, ఈ వివరాలు ముందే లీక్ అయ్యాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించనుందని అంటున్నారు. అయితే, ఆమె ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'టక్ జగదీష్' సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇక ఈ చిత్రాన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











