twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేమస్ ఛానెల్‌కు సలార్ హక్కులు: కళ్లుచెదిరే రేటు పలికిన ప్రభాస్ మూవీ

    |

    సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తన హవాను చూపించి.. 'బాహుబలి' చిత్రం నుంచి పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి కేవలం భారీ చిత్రాల్లో మాత్రమే నటిస్తోన్న అతడు.. అన్ని ఇండస్ట్రీల్లో తన మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు. ఇలా ఇప్పుడు అతడు ఏకంగా మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

    లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

    క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కూడా తీశారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూట్‌కు బ్రేక్ పడింది. దీంతో చిత్ర యూనిట్ బిజినెస్ తదితర కార్యక్రమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ డీల్‌ను క్లోజ్ చేసుకుందని తెలిసింది.

    Star Maa bagged Prabhas Salaar Movie Satellite Rights

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధించిన తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్‌కు అప్పుడే భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హక్కులను స్టార్ మా సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ ఛానెల్ భారీ ధరకు కొనుగోలు చేసిన అతి తక్కువ చిత్రాల్లో 'సలార్' ఒకటిగా నిలిచిందని అంటున్నారు. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

    విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదటవిడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

    'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2023 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నారు.

    English summary
    Pan India Star Prabhas Now Doing Salaar Movie under Prashanth Neel Direction. Now Star Maa bagged This Movie Satellite Rights
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X