చిరంజీవిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు.. 13 కుట్లు పడేలా అల్లు అరవింద్ కొట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసా?

స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. కష్టపడితే ఎవరైనా, ఎంతటి సామాన్య కుటుంబం నుంచి వచ్చినా అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని చిరు నిరూపించారు. దశాబ్ధాలుగా తెలుగుతెరను మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారాయన. చిరంజీవిని ప్రేరణగా తీసుకుని ఎంతోమంది నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అలాగే మెగాస్టార్ వేసిన బాటలో ఆయన కుటుంబం నుంచి దాదాపు డజను మంది ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్నారు.

చిరంజీవి సామర్ధ్యాన్ని, ప్రతిభను గుర్తించిన దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య.. ఆయనను అల్లుడిగా చేసుకున్నాడు. అప్పటికీ అల్లు.. హాస్యనటుడిగా వెలుగొందుతున్నారు. డబ్బు, హోదా, పలుకుబడి విషయంలో అల్లు రామలింగయ్యతో చిరు సరితూగలేరు. అంతేకాకుండా సురేఖకు ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి. అయినప్పటికీ చిరంజీవి ఎప్పటికైనా వృద్ధిలోకి వస్తారని నమ్మకం ఉంచిన అల్లు.. తన కూతురు సురేఖను ఇచ్చి చిరంజీవితో పెళ్లి చేశారు రామలింగయ్య. 1980 ఫిబ్రవరి 20న అతిరథ మహారథుల సమక్షంలో చిరంజీవి - సురేఖల పెళ్లి ఘనంగా జరిగింది.

star Producer Allu Aravind tells about the Fight at Devi- Sridevi Theatres

అల్లు కారణంగా చిరంజీవికి మంచి అవకాశాలు వచ్చాయని అప్పట్లో అనుకునేవారు. ఇక చిరు స్టార్‌గా ఎదిగాక గీతా ఆర్ట్స్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందనేది కూడా అంతే వాస్తవం. శుభలేఖ, యమకింకరుడు, హీరో, విజేత, ఆరాధన, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , రౌడీ అల్లుడు, ఎస్పీ పరశురామ్, మాస్టర్, అన్నయ్య, డాడీ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. అల్లు అరవింద్ - చిరంజీవి తొలి బావబామ్మర్దుల మాదిరిగా కాకుండా స్నేహితుల్లా మెలిగేవారు. సినిమాలు, వ్యక్తిగత విషయాలపై అరవింద్ సూచనలు , సలహాలను తూచా తప్పకుండా పాటించేవారు చిరు. అయితే మెగాస్టార్ ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఈ స్థాయికి వచ్చారని, ఆయన వెనుక నిలబడి చిన్న చిన్న బాధ్యతలను తాను నిర్వర్తించానని అందుకే చిరంజీవి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫ్రీగా సినిమాలపై దృష్టి పెట్టారని అల్లు అరవింద్ చెప్పేవారు.

బావ చిరంజీవి అంటే అరవింద్‌కు కూడా ఎంతో అభిమానం. ఆయనపై ఈగ వాలనిచ్చేవారు, ఎవరైనా పల్లెత్తు మాట అన్నా కూడా ఊరుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో ఒకసారి చిరంజీవిని ఓ వ్యక్తి అసభ్యంగా దుర్భాషలాడితే అతనిని చితకబాదారట అల్లు అరవింద్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అరవింద్ కుటుంబానికి దేవి శ్రీదేవి అనే థియేటర్ ఉండేదట. దానిని రవిరాజా పినిశెట్టి, సత్యరెడ్డి, లోక్ సింగ్, సాగర్, భానుచందర్ కలిసి నిర్వహించేవాళ్లు.

star Producer Allu Aravind tells about the Fight at Devi- Sridevi Theatres

అయితే అల్లు రామలింగయ్య, చిరంజీవి, శ్రీదేవి, రావు గోపాలరావు కాల్షీట్లు చూసే ఓ పెద్దమనిషి ఉండేవాడని.. కానీ ఆయన మందు తాగితే మనిషి కాదని అరవింద్ తెలిపారు. ఓ రోజున బాగా మందుకొట్టి చిరంజీవిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఒకటి రెండుసార్లు చెప్పి చూశానని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి డైరీ చూస్తూ ఇలా మాట్లాడకూడదని.. దానిని ఆయనకు సరెండర్ చేయమని హెచ్చరించానని అరవింద్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం చిరంజీవి దాకా వెళ్లగా.. ఆయన కూడా సీరియస్ అయ్యారట.

ఈ నేపథ్యంలో శ్రీదేవి థియేటర్‌లో ఓ సినిమా చూసి బయటకు వస్తుండగా.. ఆ పెద్ద మనిషి తాగొచ్చి చిరంజీవిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని అల్లు అరవింద్ తెలిపారు. సున్నితంగా మందలించినా వినకపోవడంతో తాను థియేటర్ మేనేజర్‌ని పిలిచి కళ్లజోడు, వాచ్ అతనికి ఇచ్చి.. ఆ పెద్దమనిషి కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టానని చెప్పారు. ఈ గొడవ కారణంగా ఆయనకు 13 కుట్లు పడ్డాయని అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు.

star Producer Allu Aravind tells about the Fight at Devi- Sridevi Theatres

చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే ట్రీట్‌మెంట్ ఇలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన చేతిలో దెబ్బలు తిన్న ఆ పెద్దమనిషి ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. ఆ వ్యక్తి పేరును వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. అతడి పేరు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని ప్రశ్నను దాటవేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X