Devara: ‘రాత్రంతా నిద్ర పోలేదు.. 2 గంటల 40 నిమిషాలు అలానే ..: ‘దేవర’పై స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్..

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఆరేండ్ల తరువాత తారక్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. ఇక ఆచార్య డిజాస్టర్ తర్వాత సినిమా కావడంతో హిట్ ఇస్తారనే నమ్మకం దర్శకుడు కొరటాల శివపై రెట్టింపు అయ్యింది. అయితే దేవర సినిమా చూసిన తర్వాత మిక్స్డ్ టాక్ వస్తుంది. ఈ మూవీపై ఓ వర్గం వారు కావాలని మరీ ట్రోల్స్ చేస్తురనే టాక్ ఇండస్ట్రీలోను, సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. ఈ తరుణంలో దేవర మూవీపై సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?

సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మాట్లాడుతూ.. 'తెలుగు సినిమా.. ఒక స్టార్ సినిమా.. వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాగా ఓవర్సీస్ లో కూడా పండగ వాతావరణం నెలకుంటుంది. అర్థరాత్రి 1 గంటలకు నిద్ర పోకుండా థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ సినిమాలు చూసే కల్చర్ వచ్చింది. నేను కూడా అర్థరాత్రి 1 గంటల రాత్రి థియోటర్ కు వెళ్లి సినిమా చూసాను. కామన్ గా నేను 10 గంటల వరకు పడుకుంటా.. అలాంటి నైట్ అంతా పడుకోకుండా దేవర మూవీ చూశాను. నిజంగా తెలుగు సినిమాను ఇంతలా ప్రపంచ స్థాయిలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి ఎకర్జైజ్మెంట్ ఇస్తే.. మాకు కూడా ఇలాంటి సినిమాలు నిర్మించాలని కసి పెరుగుతుంది' అన్నారు దిల్ రాజ్.

Star producer Dil Raj made shocking comments on NTR Devara movie

ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మాట్లాడుతూ.. ' డైరెక్టర్ శివ మూడు సంవత్సరాలు పడ్డ కష్టానికి ఫలితం దేవర. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కాంట్రాగ్స్. ఈ మూవీలో ఎన్టీఆర్ ప్రసన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ రెండు గంటల 40 నిమిషాలు అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ షోలో ఎక్కడ కూడా టెంపో తగ్గించకుండా సినిమా తీయడం చాలా గ్రేట్. ఈ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ శివ. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఇలా అలా అనే మూమెంట్స్ లేకుండా సినిమాను ఒకే టెంపోలో తీశారు. ఈ మూవీ రెవెన్యూ పరంగా రెండవ బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలుస్తోంది. ఇదే స్పిరిట్ తో సీక్వెల్ తీయాలి. కొత్త మ్యాచ్ ఆడుతున్న ఓల్డ్ టీం కి కంగ్రాజులేషన్స్' అని అభినందించారు దిల్ రాజ్.

'ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు స్టార్ హీరోని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. మన తెలుగు సినిమాని ఆ స్థానంలో ఉంచుతున్న మన హీరోలు, డైరెక్టర్లందరికీ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు, ప్రతి ఒక్క అందరి హీరోల అభిమానులకు ఉంది. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి.. తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్ హీరోలు అందరినీ వాళ్లు ఓన్ చేసుకున్నారు. ఒకప్పుడూ ఇండియన్ మూవీ అంటే.. హిందీ సినిమాగానే పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పడు పరిస్థితులు మారాయి' అని అన్నారు.

Star producer Dil Raj made shocking comments on NTR Devara movie

'మన తెలుగు సినిమాను కూడా ఇండియన్ సినిమాలా గుర్తిస్తున్నారు. తెలుగు సినిమా అంటే.. సౌత్ నుంచి వచ్చే సినిమా అని బాలీవుడ్ లో కూడా మాట్లాడుతున్నారు. ఇంతలా తెలుగు సినిమాని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లినా దర్శకులకు, మన స్టార్ హీరోలందరికీ థాంక్యు వెరీ మచ్. ఎందుకంటే.. మేము గతంలో చేసిన సినిమాలకు కేవలం తెలుగు స్టేట్స్ లోనే మార్కెట్ ఉండేది. ఆ తరువాత ఓవర్సీస్ మార్కెట్. ఇప్పుడూ తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్ రేంజ్ కు వెళ్లింది' అని ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అన్నారు.

More from Filmibeat

Read more about: dil raj ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X