India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొడుకుతో దిల్ రాజు మొదటి ఫొటో.. బాక్సాఫీస్ హిట్ వచ్చినంత హ్యాపీగా భార్యతో అలా..

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా గుర్తింపు అందుకున్న వారిలో దిల్ రోజు టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పాలి. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే దిల్ రాజు ఇటీవల మాత్రం ఫ్యామిలీకి సంబంధించిన హ్యాపీ మూమెంట్స్ ను కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఆయనకు వారసుడు జన్మించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజుగారు చాలా సంతోషం లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి ఆయన కొడుకుతో ఉన్న ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతొంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

  నమ్మకమైన నిర్మాతగా..

  నమ్మకమైన నిర్మాతగా..

  దిల్ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజు ఆ తర్వాత వరుస విజయాలతో అక్ర నిర్మాతల్లో ఒకరిగా మారిపోయారు. మొదట కొత్త దర్శకులతో విభిన్నమైన చిన్న సినిమాలను చేసి నమ్మకమైన నిర్మాతగా గుర్తింపును అందుకున్నారు. ఆయన దగ్గరికి స్టార్స్ వచ్చి సినిమా చేస్తాము అనేంత స్థాయికి వచ్చారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయన మంచి లాభాలను అందుకుంటున్నారు.

   వెనక్కి తగ్గకుండా

  వెనక్కి తగ్గకుండా

  అసలైతే దిల్ రాజు మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా వెనక్కి తగ్గకుండా ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్ర ప్రముఖ నటీనటులు దర్శక నిర్మాతలు కూడా దిల్ రాజును అప్పుడప్పుడు సహాయం కూడా అడుగుతూ ఉంటారు. ఆ విధంగా తన పలుకుబడిని పెంచుకున్నారు.

  హ్యాపీ ఫ్యామిలీ

  హ్యాపీ ఫ్యామిలీ

  ఇక చాలా రోజుల తర్వాత దిల్ రాజు తన ఫ్యామిలీ మూమెంట్స్ తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల తనకు వారసుడు జన్మించిన విషయం తెలిసిందే. మొదటి భార్య మరణించిన అనంతరం తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నా దిల్ రాజు పర్సనల్ లైఫ్ ను చాలా విభిన్నంగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా తన భార్యతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు అనే చెప్పాలి.

   కొడుకుతో దిల్ రాజు

  కొడుకుతో దిల్ రాజు

  ఇక ఇప్పుడు వారసుడు జన్మించడంతో ఆయన మరింత ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే దిల్ రాజు సంబంధించిన ఒక ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయిన తన కొడుకును ఎత్తుకొని బాక్సాఫీస్ హిట్ వచ్చినంత ఆనందంగా స్మైల్ అయితే ఇచ్చారు. హాస్పిటల్ బెడ్ పై రాజు గారి భార్య తండ్రి కొడుకులను చూసి ఎంతో సంతోషంలో మునిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇక వీరి ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రేండింగా మారిపోయింది.

   మనవడి తరువాత వారసుడు

  మనవడి తరువాత వారసుడు

  దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 వ సంవత్సరంలో మరణించిన విషయం తెలిసిందే. వారికి ఒక కూతురు కూడా ఉన్నారు. కూతురుకు కొడుకు పుట్టడంతో మనవడితో చాలాసార్లు దిల్ రాజు దిగిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు వారసుడు కూడా రావడంతో దిల్ రాజు మరింత సంతోషంగా మునిగిపోతున్నారు.

  రాబోయే సినిమాలు

  రాబోయే సినిమాలు

  ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న విషయాన్ని తెలిసిందే. ఈనెల 8వ తేదీన నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదల కాబోతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరలికెక్కిన ఆ సినిమాకు మంచి హైప్ హాయ్ అయితే క్రియేట్ అయింది. అలాగే మరొకవైపు రామ్ చరణ్ - శంకర్ కలయికలో మరొక బిగ్ బడ్జెట్ సినిమాలోను నిర్మిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

  English summary
  Star producer Dil raju first photo with his son
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X