తెలుగు సూపర్ హిట్ మూవీపై కరణ్ జోహార్ కన్ను!
పరభాషా చిత్రాలు తెలుగులో విడుదలై సొమ్ముచేసుకోవడం చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు క్రమంగా తెలుగు చిత్రాలకు కూడా ఇతర భాషల్లో డిమాండ్ పెరుగుతోంది. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 చిత్రాలే ఇందుకు ఉదాహరణ. తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాల రీమేక్ హక్కుల కోసం హిందీ నిర్మాతలు ఎగబడుతున్నారు.
అడవిశేష్ నటించిన గూఢచారి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అడవిశేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించింది. జేమ్స్ బాండ్ చిత్రాన్ని తలపించేలా ఉన్న గూఢచారి చిత్రాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ చిత్రంపై బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కన్ను పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన గూఢచారి చిత్రాన్ని చూశారట. విపరీతంగా నచ్చేయడంతో రీమేక్ హక్కులు సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి అడవిశేష్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లో కూడా గూఢచారి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు కరణ్ జోహార్ హిందీలో సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం 2.0 చిత్రాన్ని కూడా హిందీలో ఆయనే విడుదల చేయబోతున్నారు. గూఢచారి చిత్రాన్ని తన బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించాలని కరణ్ జోహార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











