మొన్న పుష్ప యాక్టర్, ఇప్పడేమే స్టార్ యూట్యూబర్.. ఆ కేసుల వల్లే అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినీ రంగానికి చెందిన చాలా మంది యువ నటులు ఈ మధ్య వరుసగా అరెస్టు అవుతున్నారు. ఇటీవలే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి మెప్పించిన జగదీష్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరో స్టార్ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. అయితే పక్కింటి కుర్రాడు, చందూ గాడిగా అందరికీ సుపరిచితం అయిన ఇతగాడిని ఈరోజే నార్సింగి పోలీసుల అరెస్ట్ చేశారు. అయితే ప్రేమ పేరుతో ఇంతకాలం తనతో తిరిగి మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసిందని సమాచారం. అయితే పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నార్సింగికి చెందిన తనను యూట్యూబర్ చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడని.. ఓ అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనపై అత్యాచారం కూడా చేశాడని అందులో పేర్కంది. అయితే చాలా రోజుల పాటు ప్రేమ పేరుతో తనతోనే ఉంటూ అన్ని రకాలుగా వాడుకున్న అతడు పెళ్లి చేసుకుందామని అడగ్గానే తనను దూరం పెట్టాడని స్పష్టం చేసింది. అప్పటి నుంచి తన బ్లాక్ లో పెట్టి.. కలవకుండా తిరుగుతున్నాడని చెప్పుకొచ్చింది. అందుకే తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు కూడా వివరించింది.

Star Youtuber Chandu Sai Arrested Due to Cheat His Girl Friend Check Details

అయితే యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు యూట్యూబర్ చందు సాయిని అరెస్ట్ చేశారు. కేవలం అతడిని మాత్రమే కాకుండా అతడి తల్లిదండ్రులు, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే అమ్మాయి చందుపై చేసిన ఆరోపణలు అన్నీ నిజమేనా కాదా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Star Youtuber Chandu Sai Arrested Due to Cheat His Girl Friend Check Details

ఇదంతా ఇలా ఉండగా... చందు సాయి పూర్తి పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. చందూగాడు, పక్కింటి కుర్రాడు పేరుతో ఈయన యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు. స్పెషల్ గా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్న ఇతడికి... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు చేసే ఇతడికి ఐదున్నర లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నాయి. ఈయన చేసే వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తుంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X