అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ స్పాట్‌లో అపశృతి: గుండెపోటుతో మరణించిన సినీ ప్రముఖుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. 'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాల తర్వాత వస్తున్న దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఆగస్టు 13, 2021న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ సెట్‌లో అపశృతి చోటు చేసుకుంది.
'పుష్ప' సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. నిర్విరామంగా జరుగుతోన్న చిత్రీకరణలో అపశృతి జరిగింది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటోన్న స్టిల్ ఫొటోగ్రాఫర్ జీ శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆంబులెన్స్‌లో రాజమహేంద్రవరం తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పీఆర్వోల ద్వారా వెల్లడిచింది. శ్రీనివాస్ దాదాపు 250కి పైగా చిత్రాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీనివాస్.. సినీ రంగంపై ఉన్న మక్కువతో స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఆరంభించారు. ఈ క్రమంలోనే 1982లో 'విముక్తి కోసం' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాలకు పని చేసిన ఆయన.. 250కి పైగా చిత్రాలకు పని చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా, ట్రెజరర్‌గా, సెక్రెటరీగా పని చేశారు. ఇక, ఆయన మరణంతో 'పుష్ప' మూవీ యూనిట్‌తో పాటు సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. ఆయన మృతికి సినీ ప్రముఖులతో పాటు స్టిల్ ఫొటోగ్రాఫర్ యూనియన్ సభ్యుులు సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











