హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డ రాజ్ తరుణ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన లావణ్య
మరో హీరోయిన్‌తో ఇంట్లో ఉంటున్న హీరో రాజ్ తరుణ్‌ను తన భర్తగా పేర్కొంటున్న లావణ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నది. మీడియాలు, కెమెరాలతో వెళ్లి వారిద్దరి బండారాన్ని బయటపెట్టింది. రాజ్ తరుణ్, సదరు హీరోయిన్ పట్టుబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రాజ్ తరుణ్, లావణ్య వివాదానికి తెరపడిందని అనుకొంటున్న తరుణంలో నార్సింగి పోలీసులు ఈ కాంట్రవర్సీని మళ్లీ లైవ్ చేశారు. లావణ్య ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన అనంతరం సాక్ష్యాల ఆధారంగా రాజ్ తరుణ్‌పై చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ తీసుకోవడంతో అరెస్ట్ తప్పిందనే వార్తలు వినిపించాయి.

మీడియాలో రాజ్ తరుణ్‌పై చార్జిషీట్ వార్త సద్దుమణగకముందే లావణ్య మరో సంచలనం క్రియేట్ చేసింది. కొద్ది రోజులుగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఉంటున్న ఇంటిపై రెక్కి నిర్వహించింది. మీడియా, ఇతర కెమెరాల సహాయంతో మెరుపు దాడి చేసింది. దాంతో ఓ ఇంట్లో వారిద్దరూ ఉండటాన్ని మీడియాలో చిత్రీకరించింది.
అయితే తాము ఉంటున్న ఇంటిపై మీడియా సహాయంతో దాడి చేయడంతో రాజ్ తరుణ్, మాల్వీ షాక్ గురయ్యారు. మాల్వీపై లావణ్య తీవ్రమైన పదజాలంతో దూషించింది. నా భర్తతో నీకేంటి పని? నా భర్తతో ఎలా లివింగ్ రిలేషన్‌షిప్ పెట్టుకొంటారు? నా భర్తను టచ్ చేసే హక్కు నీకు ఎక్కడిది? నా భర్తను నాతో పంపించు అంటూ లావణ్య విరుచుకుపడింది.
అయితే లావణ్య ఎటాక్‌తో బిత్తరపోయిన రాజ్ తరుణ్ కెమెరాల నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేశారు. మాల్వీ మల్హోత్రా ఎలాంటి స్పందన లేకుండానే నిలబడిపోయింది. లావణ్య బయటపెట్టిన ఈ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇంకా ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











