పోసాని కృష్ణ మురళి ఇంటిపై అగంతుకుల రాళ్లదాడి.. పోలీసులు కేసు నమోదు

సినీ రచయిత, దర్శకుడు, నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోసాని కృష్ణ మురళీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు పోసాని ఇంటిపై రాళ్లు రువ్వి భయాందోళనలు కలిగించారు. అయితే ఆ సమయంలో పోసాని దంపతులు, కుటుంబ సభ్యులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ దాడి గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదంగా

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదంగా


రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వం, కొందరు మంత్రులపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సినీ రచయిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళీ ప్రెస్ మీట్‌ పెట్టి పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. తాను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిమానిని, ఆయన ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే తట్టుకోలేను. అందుకే పవన్‌ కల్యాణ్‌లోని వికృతరూపాన్ని బయటపెడుతున్నానని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.

పోసాని మురళికి అసభ్యకరమైన సందేశాలు, ఫోన్లు

పోసాని మురళికి అసభ్యకరమైన సందేశాలు, ఫోన్లు


పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పోసాని కృష్ణ మురళీ ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ, ఫోన్లు చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. దాంతో పవన్ అభిమానులు తనను వేధిస్తున్నారు. నా భార్య కుటుంబాన్ని బూతులు తిడుతున్నారు అంటూ హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి.. పవన్ కల్యాణ్ తల్లి, చెల్లెలు, కూతురుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మరింత వివాదంగా మార్చింది.

పవన్‌పై పోసాని వ్యక్తిగత దూషణ

పవన్‌పై పోసాని వ్యక్తిగత దూషణ


అయితే ప్రెస్ క్లబ్‌లో పోసాని కృష్ణ మురళీ మీడియా సమావేశం నిర్వహిస్తు్న సమయంలోనే ఆయనపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడికి యత్నం చేశారు. దాంతో పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. అనంతర పోసాని మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తాను కేసు పెట్టనున్నాను. ఒకవేళ తనకు ఏదైనా జరగకూడదనిది ఏదైనా జరిగితే.. అందుకు కారణం పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలి. నా చావుకు కారణం పవన్ కల్యాణ్ అంటూ పోసాని ఘాటుగా స్పందించారు.

Recommended Video

Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
పోసాని ఇంటిపై రాళ్లదాడి... కేసు నమోదు

పోసాని ఇంటిపై రాళ్లదాడి... కేసు నమోదు

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోసాని ఇంటిపై కొందరు అగంతకులు దాడి చేశారు. గత ఎనిమిది నెలలుగా వేరే ప్రాంతంలో పోసాని కృష్ణ మురళీ ఉంటున్నట్టు తెలిసింది. ఆ దాడి సమయంలో ఇంటిలో వాచ్‌మెన్ దంపతులు ఉన్నారు. కొందరు వాహనాలపై వచ్చి ఇటుక రాళ్లను విసిరారు అని వాచ్‌మెన్ చెప్పారు. కేసు నమోదు చేసి సంజీవరెడ్డి నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X