మహేష్ దర్శకుడిని కూడా వదలడం లేదు.. బన్నీ మరో బర్త్ డే గిఫ్ట్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తరువాత బిజీ అయ్యాడు. వరుసగా కథలు వినడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అల వైకుంఠపురములో సక్సెస్ తరువాత బన్నీ సుకుమార్ తో ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా మంచి ఫ్లోలో ఉన్న ఆ సినిమా షూటింగ్ ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇక సమయం అనుకూలిస్తే ఇదే ఏడాది బన్నీ ఆ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

Recommended Video

#HappyBirthdayAlluArjun: Allu Arjun Special Gift To Fans
 స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్..

స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్..

అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలను ఈ సారి అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నారు. అల..వైకుంఠపురములో.. సినిమా గ్రాండ్ సక్సెస్ అనంతరం వస్తున్న పుట్టిన రోజు కావడంతో వేడుకతో హంగామా చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా నిరాశ తప్పలేదు. ఫైనల్ గా నేడు 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న బన్నీ అభిమానులకు త్వరలో ఏదైనా స్పెషల్ అప్డేట్ ఇస్తాడా అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మహేష్ దర్శకుడిని బుట్టలో వేశాడు..

మహేష్ దర్శకుడిని బుట్టలో వేశాడు..

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' - 'భరత్ అనే నేను' అనే బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఆ దర్శకుడితో సినిమా చేయాలని అల్లు అర్జున్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. మంచి కథ దొరికితే తప్పకుండా బన్నీతో ఒక సినిమా చేస్తానని కొరటాల శివ కూడా చాలా ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చాడు. శ్రీమంతుడు సినిమా అనంతరం వీరిద్దరి కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక అల..వైకుంఠపురములో అనంతరం కొరటాలతో బన్నీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు సమాచారం.

కొరటాల స్క్రిప్ట్ ఫిక్స్ అయినట్లే?

కొరటాల స్క్రిప్ట్ ఫిక్స్ అయినట్లే?

బన్నీ గత ఏడాది నుంచి హిట్టు పడగానే వెంటవెంటనే డిఫరెంట్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ఇంకా సెట్స్ పైకి రాకపోయినా త్వరలో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఫైనల్ గా కొరటాల శివ కొత్త కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బర్త్ డే సందర్భంగా ఏదైనా ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఫ్యాన్స్ కి మరో స్పెషల్ గిఫ్ట్ అన్నమాట.

 సుకుమార్ స్పెషల్ టైటిల్

సుకుమార్ స్పెషల్ టైటిల్

సుకుమార్ తో బన్నీ చేస్తోన్న కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ నేడు రానున్న విషయం తెలిసిందే. పుష్పా అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నేటితో ఆ రూమర్స్ కి చెక్ పడే అవకాశం ఉంది. అసలు ఆ టైటిల్ బన్నీకి సెట్టవుతుందా అని ఓ వర్గం అభిమానుల్లో సందేహాలు వెలువడుతున్నాయి. మరి సుకుమార్ ఎలాంటి ప్రయోగం చేస్తాడో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X