భగవంతుడిపైనే రీసెర్చ్.. ఉత్కంఠ పెంచుతున్న 'సుబ్రహ్మణ్యపురం' ట్రైలర్!

హీరో సుమంత్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇదమ్ జగత్, సుబ్రహ్మణ్యపురం చిత్రాలలో సుమంత్ నటిస్తున్నాడు. తాజగా సుబ్రహ్మణ్యపురం చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఒక మిస్టరీ అంశం చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒక దేవాలయంలో నేపథ్యంలో అంతుచిక్కని విధంగా మరణాలు సంభవిస్తుంటే.. ఆ మిస్టరీని ఛేదించే హీరోగా సుమంత్ కనిపిస్తున్నాడు.

'గాంధార లిపి కొన్ని వందల ఏళ్ల క్రితం అంతరించిపోయిన భాష'.. మేమంతా ఆ భావంతుడి కోసం సెర్చ్ చేస్తుంటే నువ్వు మాత్రం భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు లాంటి డైలాగులు ఆసక్తి రేపుతున్నాయి. నటుడు సురేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

వీటి వెనుక దేవుడు ఉన్నా సరే.. నా కళ్ళతో చూసేవరకు, చేతులతో పట్టుకునేవరకు ఈ ఊరిని విడచిపెట్టి వెళ్లే ప్రసక్తి లేదు అంటూ సుమంత్ చెబుతున్న డైలాగ్స్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సుమంత్ సరసన ఈ చిత్రంలో ఇషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకుడు. బీరం సుధాకర రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మొత్తంగా సుమంత్ ఈ సారి ఆసక్తికరమైన చిత్రంతోనే రాబోతున్నట్లు సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ఈ చిత్ర విడుదల తేదికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Subrahmanyapuram Official Trailer released

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X