V టీజర్ అలా ఉండటానికి కారణం ఆయనే.. సుధీర్ బాబు కామెంట్స్
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబోలో రాబోతోన్న చిత్రం V. నానికి అష్టాచమ్మా, సుధీర్ బాబుకు సమ్మోహనం వంటి కూల్ హిట్స్ ఇచ్చిన ఇంద్రగంటి వీరిద్దరితో కలిసి ఓ వచ్చేశాడు. అయితే ఇందులో నాని విలన్ రోల్ చేయడంతో v (వీ)పై అంచనాలు పెరిగాయి. పోస్టర్లతోనే ఓ రేంజ్‌లో రచ్చ చేయగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ దుమ్ములేపుతోంది.
రక్షకుడుగా సుధీర్ బాబు, రాక్షసుడుగా నాని ఫస్ట్ లుక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రం విడుదల చేసిన టీజర్ కూడా సోషల్ మీడియాలో దుమ్ములేపింది. ఈ టీజర్‌లోని విజువల్స్‌కు అందరూ ముగ్దులయ్యారు. ఇదే విషయాన్ని సుధీర్ బాబు తెలుపుతూ.. వాటి వెనుకున్న మనిషి గురించి చెప్పుకొచ్చాడు.

'వీ టీజర్‌ను చూసి గనుక మీరు ఆశ్చర్యపోయి ఉంటే.. దానికి కారణం మాత్రం పీజీ విందా. ఇంద్రగంటి మోహన కృష్ణ.. తన ఆలోచనలకు వాస్తవ రూపం దాల్చేలా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు. మీరంతా కూడా పీజీ విందాకు కంగ్రాట్స్ చెప్పాలని కోరుతున్నాను. అంతేకాకుండా టీజర్‌లోంచి మీకు ఇష్టమైన్ షాట్స్‌ను పంపండ'ని సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. ఈ మూవీ ఉగాది కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











