మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ కోసం ‘v’.. ఆ పాత్ర కావాలని కోరుకున్నా.. సుధీర్ బాబు కామెంట్స్
ఇంద్రగంటి మోహనకృష్ణ అనే పేరు వినగానే ఎంతో ఆహ్లాదకరమైన హాస్యం, ప్రేమ, భావోద్వేగాలతో కూడుకున్న చిత్రాలు గుర్తుకు వస్తాయి. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అమీతుమీ, సమ్మోహనం వంటి చిత్రాలు ఆయన తెరకెక్కించినవే. తాజాగా నాని, సుధీర్ బాబులతో v అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని చేశాడు. తాజాగా ఈ మూవీ విశేషాలను సుధీర్ బాబు వెల్లడించాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

కరోనాతో వాయిదా..
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో వీ చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు థియేటర్లన్నీ మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సినిమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు.ఇప్పుడు వాయిదా పడ్డ సినిమాలన్నీ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశమున్నాయి.

ప్రమోషన్స్‌లో భాగంగా..
వీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. సుధీర్ బాబు అలీతో సరదాగా షోకు అతిథిగా విచ్చేశాడు. మూవీ గురించి జనాల్లో నానుతూ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ రకంగా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సుధీర్ బాబు వీ సినిమా విశేషాలను చెప్పుకొచ్చాడు.

మహేష్ బాబు-పవన్ కళ్యాణ్..
ఇంద్రగంటి మోహనకృష్ణ కథ చెప్పినప్పుడు ఎవరితో చేయాలని అనుకుంటున్నారని అడిగినట్టు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు-పవన్ కళ్యాణ్‌లకు సరిపోయే కథ అంటూ, వారు చేస్తే బాగుంటుందని ఇంద్రగంటి అన్నట్టు తెలిపాడు. అయితే ఆ క్యారెక్టర్ తనకు రావాలని బలంగా కోరుకున్నానని, చివరకు తనకు వచ్చిందని పేర్కొన్నాడు.
Recommended Video

జూ.నాని, జూ. అడివి శేష్..
సుధీర్ బాబు పిల్లలిద్దరూ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారని తెలిపాడు. భలె భలె మగాడివోయ్ సినిమాలో చిన్నప్పటి నాని, గూఢచారి సినిమాలో చిన్నప్పటి అడివి శేష్ పాత్రల్లో నటించారని పేర్కొన్నాడు. ఆ రెండు చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయని అన్నాడు.


Click it and Unblock the Notifications











