twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిబిఎఫ్‌సి వల్ల ఉపయోగం ఏంటీ?.. ఎట్టకేలకు నోరు విప్పిన తొలి టాలీవుడ్ హీరో!

    |

    ఎట్టకేలకు కేంద్రం తీసుకురాబోతున్న సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై ఒక టాలీవుడ్ హీరో స్పందించారు. ఇప్పటికే ఈ సవరణలకు వ్యతిరేకంగా పలువురు తమిళ హీరోలు స్పందించినా తెలుగులో ఎవరూ స్పందించలేదు. ఇక ఈ అంశంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్ప ఇప్పటివరకు తెలుగు నటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ మాట్లాడలేదు. దీంతో టాలీవుడ్ స్టార్స్ పై అసహనం వ్యక్తమవుతున్న క్రమంలో ఎట్టకేలకు సుధీర్ బాబు ముందుకొచ్చి సినిమాటోగ్రఫీ బిల్లుని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. ఈ బిల్లు వస్తే ఇక సిబిఎఫ్‌సి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

    ఇప్పటికే సినిమాలను టార్గెట్ చేయడం ఈజీగా మారిందని పేర్కొన్న ఆయన #సినిమాటోగ్రాఫ్ బిల్ అలా టార్గెట్ చేయడం ఇంకా సులభం చేస్తుందని అన్నారు. ఇక భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కుని మనం కోల్పోకూడదని ఆయన అన్నారు. మాకు భయం కలిగించే వాతావరణం అక్కర్లేదని రీ సెన్సార్ అనే ఆలోచన ఉంటే ఇక సిబిఎఫ్‌సి ఉండటం వల్ల ఉపయోగం ఏమిటి?" అంటూ ఆయన ఈరోజు ట్వీట్ చేశారు.

    Sudheer Babu is only hero opposed the controversial Cinematograph Bill

    అలా టాలీవుడ్ మొత్తం మీద ఒక్క సుధీర్ బాబు మాత్రమే ధైర్యం చేసి సినిమాటోగ్రఫీ బిల్ ను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. మరి ఇప్పటికైనా మన స్టార్ హీరోలు ఈ విషయంపై ధైర్యంగా తమ గళం విప్పుతారా ? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఆయన చివరిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న వీ సినిమాలో నటించారు. ప్రస్తుతం కరుణాకర్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ అలాగే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలలో నటిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు

    English summary
    Sudheer Babu is only hero opposed the controversial Cinematograph Bill. today he stated that ''While cinema is already an easy target, the #Cinematographbill makes it much easier to target. We should not be deprived of a constitutional right called freedom of expression. We don't want an atmosphere of fear. What's the use of having a CBFC if there's a concept of re-censor?''
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X