Sudheer Babu: ఒక్కసారిగా బరువు పెరిగిపోయిన సుధీర్ బాబు.. నెటిజన్ల విమర్శలు!
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. సినిమాల ఫలితం ఎలా ఉన్నా వరుసపెట్టి చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా హంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సుధీర్ బాబుకు మరోసారి నిరాశే మిగిలింది.
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ వంటి ప్రముఖులు టెక్నిషీయన్స్ గా వర్క్ చేసిన ఈ సినిమా యాక్షన్ పరంగా బాగున్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంతో ముందుకు వచ్చిన సుధీర్ బాబు అత్యంత బరువు పాత్ర చేయనున్నాడు.

గే పోలీస్ గా..
నైట్రో స్టార్ సుధీర్ బాబు హిట్స్ ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ఆకట్టుకోలేని సుధీర్ బాబు ఇటీవలే హంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబుతో సహా సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ గా అలరించిన ఈ సినిమా ముంబై పోలీస్ కు రీమెక్ గా వచ్చింది. ఇందులో సుధీర్ గే పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్న సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

హర్షవర్ధన్ దర్శకత్వంలో..
ఇప్పుడు మరోసారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు సుధీర్ బాబు. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'మామా మశ్చీంద్ర' అనే టైటిల్ పెట్టారు.
సృష్టి సెల్యులాయిడ్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి పీజీ విందా సినిమాటోగ్రఫీ బాధ్యత చేపట్టారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా చేస్తున్నారు.

కొత్త లుక్ లో..
'మామా మశ్చీంద్ర' సినిమాలో సుధీర్ బాబు దుర్గ అనే బండబాబు పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. అంటే అతని సిక్స్ ప్యాక్ ను పక్కన పెట్టి లడ్డూ బాబులా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పటివరకు సుధీర్ బాబు కనిపించని లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే కొంతమంది మాత్రం నెటిజన్లు ఇదంతా అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. "ఇది కూడా పోయేలా ఉంది.. సౌత్, నార్త్ సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేయు. నిన్ను కొట్టేవాడే లేడు" అన్నా అంటూ రిక్వెస్ట్ పెడుతున్నారు.

మూడు విభిన్న పాత్రల్లో..
ఇదిలా ఉంటే 'మామా మశ్చీంద్ర' సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మార్చి 1న దుర్గ అనే పాత్రను పరిచయం చేశారు. మిగిలిన రెండు పాత్రలను ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో మార్చి 4న ఒకటి, 7వ తేదీన మరొకటి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











